వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అండ్ టీమ్‌కు సుప్రీం క‌ర్రు కాల్చి వాత పెట్టిందిగా!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్య‌వ‌హారంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న నేతృత్వంలోని 21 ప్ర‌తిప‌క్ష పార్టీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. క‌నీసం 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఇదివ‌ర‌కే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః స‌మీక్షించుకోవాల‌ని కోరుతూ ఆయా పార్టీల నాయ‌కులు దాఖ‌లు చేసిన రివ్యూ పిటీష‌న్ కొట్టివేత‌కు గురి కావ‌డం విమ‌ర్శ‌కుల నోళ్ల‌కు ప‌ని చెప్పిన‌ట్ట‌యింది. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను గ‌తంలో స్వాగ‌తించిన నాయ‌కులే ఇప్పుడు దాన్ని త‌ప్పు ప‌డుతున్నార‌ని, ఇది వారి రెండు నాల్క‌ల ధోరణికి నిద‌ర్శ‌నమ‌ని అంటూ విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగుతున్నారు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు.షాకింగ్! 56 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల మైనర్ బాలిక వివాహానికి ఓకే చెప్పిన హైకోర్టు

షాకింగ్! 56 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల మైనర్ బాలిక వివాహానికి ఓకే చెప్పిన హైకోర్టుషాకింగ్! 56 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల మైనర్ బాలిక వివాహానికి ఓకే చెప్పిన హైకోర్టు

క‌ర్రు కాల్చి వాత పెట్టిందిగా!

క‌ర్రు కాల్చి వాత పెట్టిందిగా!

చంద్ర‌బాబుపై ఎప్ప‌టికప్పుడు విరుచుకుప‌డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోమారు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు, మిగిలిన రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు సుప్రీంకోర్టు క‌ర్రు కాల్చి వాత పెట్టింద‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు మానసిక స‌మ‌తౌల్యాన్ని కోల్పోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అన్ని వీవీప్యాట్లను లెక్కించడం సాధ్యం కాదని ఇదివ‌ర‌కే సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ.. ఏ ఉద్దేశంతో చంద్ర‌బాబు, ఆయ‌న రాజ‌కీయ స‌హ‌చ‌రులు రివ్యూ పిటీష‌న్ దాఖ‌లు చేశార‌ని సాయిరెడ్డి నిల‌దీశారు. దేశ అతతీర్పును తప్పు పట్టేలా మాట్లాడార‌ని అన్నారు.

స్వార్థం త‌ప్పు హూందాత‌నం లేదా?

స్వార్థం త‌ప్పు హూందాత‌నం లేదా?

చంద్ర‌బాబు త‌న 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితంలో ఏనాడూ హూందాగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని విజ‌యసాయి రెడ్డి ఆరోపించారు. ఆయ‌న చ‌రిత్ర అంతా స్వార్థపూరిత‌మేన‌ని అన్నారు. స్వార్థం త‌ప్ప చంద్ర‌బాబుకు ఇంకేమీ తెలియ‌ద‌ని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోసపూరిత పథకాలేవీ ఎక్కడా అమలు కావ‌ట్లేద‌ని, అవ‌న్నీ విఫ‌లం అయ్యాయ‌ని విమ‌ర్శించారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను రూపొందించ‌డం దారుణ‌మ‌ని అన్నారు. చంద్రబాబు సేవలో ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మన్ ఒళ్ళు తెలియనంతగా పులకరించినట్టు కనిపిస్తోందని చెప్పారు.

దేవినేని ఉమ.. ఓ బొంకుల పోలిగాడు

దేవినేని ఉమ.. ఓ బొంకుల పోలిగాడు

జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు పై విజ‌యసాయి రెడ్డి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న ఓ బొంకుల పోలిగాడిలా మారిపోయార‌ని మండిప‌డ్డారు. పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి కేంద్రాన్ని తప్పించడం కోసం చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టార‌ని, దాని స్థానంలో ప్యాకేజీకి ఆనందంగా అంగీక‌రించార‌ని ఆరోపించారు. ప్యాకేజీ కోసం రాష్ట్ర భవిష్యత్తునే ఫణంగా పెట్టారని అన్నారు. చేనుకు చేవ...రైతుకు రొక్కం అన్న మాదిరిగా పోలవరం ప్రాజెక్టు బాబుకు వరం, తమ్ముళ్ళకు జీవనాడి అయిందని చెప్పారు. కాగ్‌ కూడా అదే పేర్కొంద‌ని సాయిరెడ్డి గుర్తు చేశారు. ‘2018కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెట్టి ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు అపర భగీరథుడవుతాడు. రాసిపెట్టుకో' అంటూ దేవినేని ఉమ నిండు సభలో సవాలు విసిరార‌ని, ఇప్పుడు ఆయ‌న తల ఎక్కడ పెట్టుకుంటార‌ని ప్ర‌శ్నించారు.

English summary
YSR Congress Party Senior leader and Rajya Sabha Member V Vijayasai Reddy once again strongly criticized to Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu in the row of VVPAT Slipos Audit. The Review Petition filed by 21 Opposition Parties led by Chandrababu was rejected by the Supreme Court. In this connection, Vijayasai Reddy is criticized to Chandrababu and his allies Political leaders that, Supreme Court gave strong warning to the Leaders as review petition dismissed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X