వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి : హైకోర్టులో ఎమ‌ర్జెన్సీ పిల్‌: నేడు విచార‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కంపు వ్య‌వ‌హారం హైకోర్టుకు చేరింది. ముందుగానే వీవీప్యాట్ స్లిప్పు ల‌ను లెక్కించేలా ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో అత్య‌వ‌స‌ర పిల్ దాఖ‌లైంది. దీని పైన మంగ‌ళ‌వారి కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌నుంది. 23న కౌంటింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఈ వ్యాజ్యం పైన ఆస‌క్తి నెల‌కొని ఉంది.

ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి..
కొద్ది రోజులుగా ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరు మీద విమ‌ర్శ‌లు చేస్తున్న ప్రతిప‌క్షాలు వీవీప్యాట్స్ స్లిప్పుల‌ను పూర్తి స్థాయిలో లెక్కించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం హైకోర్టుకు చేరింది. కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా ముందుగా ఈవీఎంల కంటే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల మధ్య ఓట్ల సంఖ్యలో తేడా వచ్చిన సందర్భంలో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని కోరుతూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీని పైన హైకోర్టు ధ‌ర్మాస‌నం మంగళవారం విచారణ జరపనుంది. ఈవీఎంల చివరి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అయిదు వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటీషనర్ పిల్ ద్వారా హైకోర్ట‌ను అభ్య‌ర్దించారు.

VVpats slips to be count first before EVms count : PIL filed in AP High court..

ఈవీఎంల కంటే ముందైతేనే క‌రెక్ట్...
ఓట్ల లెక్కింపులో ముందు ఈవీఎంల లెక్కింపు చేప‌డితే ఏ అభ్య‌ర్దికి ఎక్కువ ఓట్లు వ‌చ్చాయో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. దీని త‌రువాత వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించినా ఉప‌యోగం ఉండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇది అనుమానాల‌కు .. వివాదాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అదే స‌మ‌యంలో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేన‌నే వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. ఈ నేపథ్యంలో వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల మధ్య తేడాలొస్తే అన్ని స్లిప్పులను లెక్కించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘందేన‌ని పిటీష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారం పైన ఇప్ప‌టికే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా..ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు జారీ చేయ‌లేద‌న్న‌ది పిటీష‌న‌ర్ వాద‌న‌. దీంతో..ఈ కేసు విచార‌ణ స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం ఇచ్చే వివ‌ర‌ణ ఏ ర‌కంగా ఉంటుంది..వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపు పైన ఎటువంటి నిర్ణ‌యం కోర్టు తీసుకుంటుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
PIL filed in AP High court on VVpats Slips to be count first priority in Counting process. Petitioner filed emergency PIL and court decided to start proceedings from to day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X