వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాడు యాత్ర: జగన్‌పై దుమ్మెత్తిపోసిన పంచుమర్తి అనురాధ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వాక్ విత్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌‌తో ప్రజలు ఎక్కడికి నడుస్తారు, జైలుకా అని ఆమె అడిగారు.

Recommended Video

జగన్ @1000 : మరీ ఇన్ని మోసాలా, చంద్రబాబు పై నిప్పులు

జగన్‌ది పాదయాత్ర కాదని, అది పాడు యాత్ర అని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రకు లక్ష్యం లేదని ఆమె అన్నారు. ప్రజలు జగన్‌ను తిరస్కరంచారని, భవిష్యత్తులో కూడా తిరస్కరిస్తారని ఆమె అన్నారు.

వెంటాడుతున్నట్లుగా జగన్

వెంటాడుతున్నట్లుగా జగన్

జగన్ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాదయాత్ర చేయడం లేదని పంచుమర్తి అనురాధ అన్నారు. తనను ఎవరో వెంటాడుతున్నారని భయపడుతున్నట్లుగా జగన్ పాదయాత్ర సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. నాయకుల ప్రయోజనాల కోసం జరిగే పాదయాత్ర వల్ల ఫలితాలు ఉండవని అన్నారు.

అప్పుడలా చెప్పి ఇప్పుడు

అప్పుడలా చెప్పి ఇప్పుడు

పాదయాత్రలో జగన్ చేస్తున్న వాగ్దానాలు అమలు అయ్యేవి కావని అనురాధ అన్నారు. గతంలో ఆ అంశాలనే ప్రస్తావించినప్పుడు ఆచరణ సాధ్యం కాదని జగన్ అన్నారని ఆమె గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ సాధ్యం కాదన్న జగన్ ఇప్పుడు అదే హామీ ఇస్తున్నారని ఆమె అన్నారు.

ఎన్ని బ్రేకులు తీసుకున్నారు..

ఎన్ని బ్రేకులు తీసుకున్నారు..

నలబై ఏళ్ల వయస్సు గలవారికి పింఛను ఇస్తానని చెప్పడం మూర్ఖత్వమని అనురాధ అన్నారు. వేయి కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ కోర్టుకు వెళ్లడానికి ఎన్ని బ్రేకులు తీసుకున్నాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

దాన్ని పాదయాత్ర అని ఎలా అంటారు..

దాన్ని పాదయాత్ర అని ఎలా అంటారు..

జగన్ ప్రతి గురువారం పాదయాత్రను ఆపేస్తున్నారని, మళ్లీ శనివారం యాత్రను ప్రారంభిస్తున్నారని అనురాధ అన్నారు. దాన్ని పాదయాత్ర అని ఎలా పిలుస్తారని ఆమె ప్రశ్నించారు.

English summary
TDP spokesperson P. Anuradha lambasted the YSR Congress for conducting "Walk with Jagan" and questioned where should the public walk with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X