వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి చెప్పేద్దాం.. బాబుకు వీర్రాజు ఊహించని షాక్! ఏం పట్టించుకోం.. మెట్టుదిగిన టీడీపీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో మిత్రపక్షాలు తెలుగుదేశం, బీజేపీల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. గతంలో ప్రత్యేక హోదా, ఇటీవల పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలతో పాటు వివిధ సందర్భాల్లో గత మూడేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య వాగ్యుద్ధం కనిపించింది.

Recommended Video

చంద్రబాబూ నువ్వు కాంగ్రెస్‌తో కలిశావ్ : పవన్ కళ్యాణ్ వల్లే !

స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం సహకారం అవసరమని చెబుతూ ఆయన చల్లబడుతున్నారు. పార్టీ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించినప్పుడు క్లాస్ పీకుతున్నారు.

మాటల యుద్ధం

మాటల యుద్ధం

బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి నాయకులు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దని, అసలు బీజేపీ నేతలు మనపై విమర్శలు చేస్తే ఓపిక పట్టాలని చంద్రబాబు నేతలకు పలుమార్లు సూచించారు. కానీ బీజేపీ నేతల విమర్శలకు టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

గుజరాత్ తెచ్చిన చిచ్చు

గుజరాత్ తెచ్చిన చిచ్చు

తాజాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సోము వీర్రాజు సోమవారం మాట్లాడుతూ.. ఏపీలోను బలపడుతామంటూ టీడీపీపై విమర్శలు చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోము వీర్రాజుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయన మంగళవారం టీడీపీ దుమ్ము దులిపారు.

మౌనంగా ఉండాలని హెచ్చరిక

మౌనంగా ఉండాలని హెచ్చరిక


ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారని ఆరోపణలు చేస్తూ వరుసగా అప్పటి నుంచి జరిగిన పరిణామాలను చెబుతూ తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. రాజేంద్రప్రసాద్ బీజేపీపై విమర్శలు గుప్పించడంపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఏమన్నా మౌనంగా ఉండాలని, అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్దామన్నారు.

రెచ్చిపోయిన సోము వీర్రాజు, మొత్తం తవ్వారు

రెచ్చిపోయిన సోము వీర్రాజు, మొత్తం తవ్వారు

కానీ, రాజేంద్రప్రసాద్ తీవ్ర విమర్శలు చేయడంతో మంగళవారం సోము వీర్రాజు రెచ్చిపోయారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి గతంలో మద్దతివ్వడం, టీడీపీ వల్లే బీజేపీ ఎదుగుదల ఆగిపోయిందని ఆరోపణలు చేయడం, అసలు మోడీ-పవన్ కళ్యాణ్ లేకుంటే 2014లో చంద్రబాబు గెలిచేవారా, ఇటీవల కాకినాడ పురపాలక ఎన్నికల్లో మేం సొంతగా పోటీ చేస్తే గెలిచేవారా అంటూ అంతా తవ్వారు. 2004లో బాబు చెప్పినట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్నామని ఆరోపించారు. మోడీ వల్ల లోకేష్‌కు 20 ప్రైజ్‌లు వచ్చాయని విమర్శించారు.

కాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనంకాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనం

సోము వీర్రాజు కౌంటర్‌తో దిమ్మ తిరిగింది

సోము వీర్రాజు కౌంటర్‌తో దిమ్మ తిరిగింది

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఇచ్చిన కౌంటర్‌కు టిడిపి నేతల దిమ్మ తిరిగిపోయినట్లుగా చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అంటూ ఉన్నది లేనిది చెప్పడం ఎంత వరకు నిజమని వాపోతున్నారట. ఇదే విషయాన్ని అవసరమైతే బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని చంద్రబాబుకు చెప్పనున్నారని తెలుస్తోంది. కాగా, బీజేపీ నేతల మాటలకు మౌనంగా ఉండాలని, ఇలా ప్రతి దానికి మాట్లాడి మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో చిక్కులు కొని తెచ్చుకోవద్దని చంద్రబాబు మరోసారి వారించారని తెలుస్తోంది.

మీ మాట నమ్మి వాజపేయి ఓడిపోయారు, నోట్లు పంచి గెలిచారు: బాబును దులిపిన వీర్రాజుమీ మాట నమ్మి వాజపేయి ఓడిపోయారు, నోట్లు పంచి గెలిచారు: బాబును దులిపిన వీర్రాజు

మేం పట్టించుకోం, మెట్టు దిగిన టీడీపీ

మేం పట్టించుకోం, మెట్టు దిగిన టీడీపీ

మరోవైపు, తాజాగా సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యల అనంతరం కూడా టీడీపీ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. టీడీపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ - బీజేపీలు కలిసి విభజన సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పారు. మోడీ సహకరిస్తున్నారని చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మోడీ, చంద్రబాబు, అమిత్ షాలు మాట్లాడటం లేదన్నారు. సోము వీర్రాజు, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీయేలో తాము మిత్రపక్షమే అన్నారు. సోము వీర్రాజు మాట్లాడితే సీరియస్‌గా తీసుకోమన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు మాట్లాడాలన్నారు. 2014లో టీడీపీతో కాకుండా జగన్‌తో వెళ్దామని వీర్రాజు అనుకున్నారా అని ప్రశ్నించారు. జగన్ అన్న కాదని, ఆయన ఓ తాతయ్య అని ఎద్దేవా చేశారు. ఆయన వయస్సు 45 ఏళ్లు అన్నారు. వైసీపీ పాలసీ ప్రకారం ఆయనకు వృద్ధాప్య పింఛను వస్తుందన్నారు.

English summary
War of words between BJP and TDP leaders Rajendra Prasad and Somu Veer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X