వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటల యుద్దం: ఎన్నికల కోసమే పోలవరం స్పిల్‌వే పనులు: బిజెపి, ఏపీపై కేంద్రం పోలీసింగ్: టిడిపి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల విడుదల విషయమై టిడిపి , బిజెపి నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.శాసనమండలిలో టిడిపి, బిజెపి ఎమ్మెల్సీల మధ్య బుధవారం నాడు మాటల యుద్దం సాగింది.

మూడేళ్ళలో ఏపీకి ఎంతో చేశాం, ఆ సిఫారసు మేరకే, ఆ పార్టీకి చిత్తశుద్ది లేదు: హరిబాబుమూడేళ్ళలో ఏపీకి ఎంతో చేశాం, ఆ సిఫారసు మేరకే, ఆ పార్టీకి చిత్తశుద్ది లేదు: హరిబాబు

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి అసంతృప్తిగా ఉంది. బిజెపితో పొత్తు విషయమై అమీతుమీ తేల్చుకోవాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాన్ని సేకరించారు.

Recommended Video

Ap Budget Sessions : Chandrababu Naidu Revealed Everything

కేంద్రం పాత పాటే పాడింది, జైట్లీ ప్రకటనపై అసంతృప్తికేంద్రం పాత పాటే పాడింది, జైట్లీ ప్రకటనపై అసంతృప్తి

శాసనమండిలో టిడిపి, బిజెపి ఎమ్మెల్సీల మధ్య బుధవారం నాడు వాగ్వావాదం చోటు చేసుకొంది. టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ మధ్య నిదుల కేటాయింపు విషయమై మాటల యుద్దం చోటు చేసుకొంది.

శాసనమండలిలో బిజెపి, టిడిపి ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్దం

శాసనమండలిలో బిజెపి, టిడిపి ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్దం

ఆంధ్రప్రదేశ్‌లో అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. బిజెపి విమర్శలకు టిడిపి కౌంటరిచ్చింది. ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆరోపించారు.

టిడిపిపై మాధవ్ విమర్శలు

టిడిపిపై మాధవ్ విమర్శలు

టీడీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటున్నారు ఎప్పుడు ఇవ్వలేదో చెప్పమనండి. ఎయిమ్స్ పనిజరగడం లేదని టీడీపీ అధికార వెబ్‌సైట్‌లో తప్పుడు రాతలు రాస్తున్నారని మాధవ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బాకీ లేదని మాధవ్ తేల్చి చెప్పారు.

ఎన్నికల కోసమే స్పిల్ వే పనులు

ఎన్నికల కోసమే స్పిల్ వే పనులు

2019 ఎన్నికల కోసమే పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులను చేపట్టారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ టిడిపిపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఏపీకి నిధుల కేటాయింపు విషయమై తామన్నీ నిజాలే చెబుతామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు.

ఏపీపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది

ఏపీపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది

బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలపై టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిదులను కేటాయించడం లేదన్నారు..ఇది రాజకీయ ధర్మమా, మిత్ర ధర్మమా? ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతివిషయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అహ్మదాబాద్, ముంబై మెట్రోకు వేల కోట్లు కేటాయిస్తారు. అమరావతి మెట్రోకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పోలీసింగ్ చేస్తోందని మాణిక్యవరప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు.

English summary
War words between Bjp MLC Madhav and Tdp MLC Dokka Manikya Varaprasad in Legislative council on Wednesday.Bjp Mlc madhav made allegations on Tdp government, Tdp Mlc Manikya varaprasad condemned Madhava allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X