హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య కుట్ర: అక్బరుద్దీన్ ఓవైసీకి భద్రత పెంపు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు: మజ్లిస్ పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ హత్యకు కుట్ర జరిగింది! అక్బర్ హత్యకు సుపారీ తీసుకున్న వ్యక్తి హిందూపురంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా యాక్సిడెంట్‌కు గురవడంతో ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది. పోలీసులు అతణ్ని పట్టుకుని ప్రశ్నించగా గ్యాంగ్‌లోని మరో ముగ్గురు దొరికిపోయారు.

ఆరేళ్లుగా వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న గిరి అనే అంతర్రాష్ట్ర నేరగాడి బృందం పదిహేను రోజులుగా హిందూపురంలో మకాం వేసింది. శనివారం రాత్రి గిరి తన ప్రియురాలి ఇంటి నుంచి వెళ్తుండగా బండి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్నవారు చికిత్స నిమిత్తం అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అతడి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేశారు.

గిరి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో అతడి దుస్తులు, వస్తువులు సోదా చేశారు. అతడి వద్ద ఒక పిస్టల్, రెండు లైవ్ రౌండ్ల బుల్లెట్లు, ఒక నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ బయటపడటంతో అప్రమత్తమయ్యారు. వాటిని స్వాధీనం చేసుకుని అతణ్ని విచారించగా మొత్తం విషయాలూ పూసగుచ్చినట్టు చెప్పాడు. తన పేరు గిరి అని.. తనది కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా హోసూరు గ్రామమని తెలిపారు. అతడిచ్చిన సమాచారం మేరకు అతడి గ్యాంగ్‌కు చెందిన గోవింద్, వాసు, మంజులను అరెస్టు చేశారు.

వారంతా కర్ణాటకలో అనేక దొంగతనాలు చేశారని, వారిపై 80కి పైగా కేసులున్నాయని తేలింది. దీంతో హిందూపురం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిని మినహా మిగతా ముగ్గురినీ అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.

కాగా, గిరి బృందం హైదరాబాద్‌కు చెందిన మజ్లిస్ నేతల్లో ఒకరిని హతమార్చేందుకు సుపారీ తీసుకున్నట్టు తెలిసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. వారు పేరు వెల్లడించనప్పటికీ గిరి పేర్కొన్న అక్బరుద్దీనే అనే కథనాలు వినిపిస్తున్నాయి. గిరి గ్యాంగ్‌కు సుపారీ ఎవరు ఇచ్చారో ఇంకా తెలియలేదు. దీని వెనుక అసలు కారణాలు ఏమిటన్నది తేలనప్పటికీ రెండు వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

నాంపల్లిలోని ఓ భూవివాదమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2011, ఏప్రిల్ 30న బార్కస్‌లో మహ్మద్ పహిల్వాన్ గ్యాంగ్ అక్బరుద్దీన్‌పై పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు జరిపిన సంఘటనలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. బండ్లగూడలోని భూవివాదమే దీనికి కారణమని తేలింది. తాజాగా గిరి గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చింది రాజకీయ ప్రత్యర్థులేనని మజ్లిస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్ హత్యకు కుట్ర నేపథ్యంలో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన దారుస్సలేంలో పార్టీ బహిరంగ సభలో మాట్లాడారు.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్ హత్యకు కుట్ర నేపథ్యంలో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన దారుస్సలేంలో పార్టీ బహిరంగ సభలో మాట్లాడారు. మజ్లిస్ పార్టీని గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అక్బర్, అసద్

అక్బర్, అసద్

దారుస్సలేంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హైదరాబాదు నుండి ఎంపీగా గెలుపొందిన అసదుద్దీన్ ఓవైసీ, చాంద్రాయణగుట్ట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన అక్బరుద్దీన్ ఓవైసీ.

అక్బర్, అసద్

అక్బర్, అసద్

దారుస్సలేంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హైదరాబాదు నుండి ఎంపీగా గెలుపొందిన అసదుద్దీన్ ఓవైసీ, చాంద్రాయణగుట్ట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన అక్బరుద్దీన్ ఓవైసీ.

అక్బర్

అక్బర్

దారుస్సలేంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాంద్రాయణ గుట్ట నుండి గెలుపొందిన మజ్లిస్ ముఖ్యనేత అక్బరుద్దీన్ ఓవైసీ దృశ్యం.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

దారుస్సలేంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాంద్రాయణ గుట్ట నుండి గెలుపొందిన మజ్లిస్ ముఖ్యనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఫోటోలు ప్రదర్శిస్తున్న అభిమానులు.

సెక్యూరిటీ

సెక్యూరిటీ

మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, చాంద్రాయణగుట్ట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన అక్బరుద్దీన్ హత్యకు కుట్ర నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు.

సెక్యూరిటీ

సెక్యూరిటీ

మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, చాంద్రాయణగుట్ట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన అక్బరుద్దీన్ హత్యకు కుట్ర నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు.

English summary
Have police stumbled upon a plot to eliminate a high-profile legislator in the city? A team from Hyderabad has rushed to Bangalore to question members of a Karnataka-based dacoit gang who were nabbed by the Hindupur police, reportedly on a mission to execute a 'supari' killing in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X