విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాహనదారులకు షాక్: డీజిల్, పెట్రోల్ బదులు నీరు కొట్టి పంపిస్తున్నారు! ఏం జరిగిందంటే.?

|
Google Oneindia TeluguNews

విజయనగరం: ఇటీవలి కాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో రీడింగ్ చూపిస్తున్నప్పటికీ ఆ మేరకు పెట్రోల్ వాహనాల్లోకి మాత్రం వెళ్లడం లేదు. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పోయాలంటూ వినియోగదారుడు కోరితే సగం మాత్రమే పోసి ఆపేస్తున్నారు. అయితే, రీడింగ్ మాత్రం లీటర్ పూర్తయినట్లు చూపించడం గమనార్హం. ఇలా చేయడంతో పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఆందోళనలు కూడా నిర్వహించారు.

తాజాగా ఇలాంటి ఘటనే పాచిపెంట మండలంలోని శ్యామలగౌరీపురం సమీపంలో జాతీయ రహదారికి పక్కనున్న ఓ పెట్రోల్ బంక్‌లో చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కనున్న ఓ బంక్‌లో ఓ వినియోగదారుడు డీజిల్ కోసం వెళ్లాడు. అయితే, అక్కడ డీజిల్ బదులు వర్షపు నీటిని అతడి వాహనంలో నింపడం గమనార్హం.

సీఎం జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ విద్యార్థుల హెచ్చరిక

డీజిల్ కోసం వెళితే..

డీజిల్ కోసం వెళితే..

శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఓ కారు యజమాని ఆ పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ తన వాహనంలో కొట్టాలని సిబ్బందిని కోరాడు. దీంతో కారు ట్యాంకును ఓపెన్ చేసి నింపారు. అయితే, ఆ కారు కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయింది. దీంతో కారు యజమాని కారు ఆపి ట్యాంకులో పరిశీలించగా అందులో డీజిల్ బదులు నీరు ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నేరుగా పెట్రోల్ బంకుకు వెళ్లి నిలదీశాడు.

డీజిల్ బదులు వర్షపు నీరు..

డీజిల్ బదులు వర్షపు నీరు..

కాగా, అప్పటికే మరికొంత మంది వినియోగదారులు కూడా ఇదే విషయంపై పెట్రోల్ బంకు సిబ్బందితో గొడవపడుతున్నారు. డీజిల్‌కు బదులు నీటిని నింపి మోసం చేశారంటూ మండిపడ్డారు. అయితే, డీజిల్‌కు బదులు నీటిని వాహనాల్లో కొట్టిన విషయం తమకు ముందే తెలియదని సిబ్బంది తెలిపారు.

కొత్త కారు ఇలా అయ్యిందంటూ..

కొత్త కారు ఇలా అయ్యిందంటూ..

తన కొత్త కారులో ఈ వర్షపు నీరు నింపడంతో అది పనిచేయకుండా మారిందని నాయుడు అనే కారు యజమాని వాపోయారు. మార్గమధ్యలోనే ఆగిపోతే.. ఓ ఆటో సాయంతో కారును బంకు వరకు తీసుకొచ్చానని తెలిపారు. పెట్రోల్ బంకు యజమాని జరిగిన పొరపాటుకు సంజాయిషీ ఇవ్వడంతోపాటు కారు రిపేర్‌కు ఖర్చులు కూడా ఇస్తానని చెప్పాడని తెలిపారు. నీరు నింపిన కారణంగా కార్లు, ఆటోలతోపాటు బైక్‌లు కూడా పాడైపోయాయని అన్నారు.

అదే కారణమంటూ యజమాని..

అదే కారణమంటూ యజమాని..

కంపెనీవారు 15ఏళ్ల క్రితం పైపులు వేశారని.. అవి పాడవ్వడం వల్లే వర్షపునీరు కలిసి పోయి ఉంటుందని బంకు యజమాని గోపాల్ చెప్పడం గమనార్హం. ఇప్పటికే ఈ విషయంపై కంపెనీకి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇలా వర్షపు నీరు కొట్టడంతో తమ వాహనాలు పనిచేయకుండా తయారయ్యాయని వాహనదారులు లబోదిబోమంటున్నారు.

English summary
Water comes instead of Diesel in a petrol pump in Vizianagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X