
ఆంధ్రప్రదేశ్ లో...నేటి నుంచి జల సంరక్షణ ఉద్యమం...116 రోజులు
అమరావతి:
ఎపి
ప్రభుత్వం
నేటి
నుంచి
రాష్ట్ర
వ్యాప్తంగా
జల
సంరక్షణ
ఉద్యమానికి
శ్రీకారం
చుడుతోంది.
రాష్ట్రాన్ని
కరువు
రహితంగా
తీర్చిదిద్దే
చర్యల్లో
భాగంగా
ప్రభుత్వం
ఈ
జల
సంరక్షణ
ఉద్యమాన్నిసిద్దం
చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా
116
రోజుల
పాటు
భారీ
స్థాయిలో
ఈ
జల
సంరక్షణకు
సంబంధించిన
పనులు
నిర్వహించనున్నారు.
రాజధాని నగరం అమరావతి పరిధిలో పాలవాగు వద్ద సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొంటారు.

రాష్ట్రాన్ని కరువు రహితంగా మలిచేందుకు ప్రజలకు అవసరమైన తాగు, సాగు నీటి అవసరాలు తీర్చడం...పారిశ్రామిక అవసరాల కోసం నీటిని అందించడం...నీరు-ప్రగతి, నీరు-చెట్టు వంటి కార్యక్రమాలను ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జల సంరక్షణ కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 116 రోజుల పాటు సాగే ఈ జల సంరక్షణ కార్యక్రమంలో ఈ నెల మూడో వారం నుంచి సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు.
ఈ జల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా నదీ జలాలను ప్రాజెక్టులలోనూ, చెరువుల్లోనూ నిల్వ చేయడంపై దృష్టి సారిస్తారు. అందుకోసం చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే భూగర్భ జలాల పరిస్థితిపై విశ్లేషించనున్నారు.