వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''పోలవరం కాంట్రాక్ట్ దక్కితే వైసీపీ పుట్టేదే కాదు, 2018 నాటికి పోలవరం నీరిస్తాం''

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు వైఎస్ జగన్ బృందానికి దక్కితే వైసీపీ పార్టీ పుట్టకపోయి ఉండేదని ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజక్ట్ దక్కని కారణంగానే జగన్ పార్టీ ఏర్పాటు చేశారని దేవినేని ఆరోపించారు.

Recommended Video

గుజరాత్ BJP ఎఫెక్ట్ : 2018, 2019 ఎన్నికలపై ప్రభావం, జగన్ కి కలిసొచ్చే అంశమే !

2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నీటిని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే కృత నిశ్చయంతో ఉన్నట్టు దేవినేని ఉమా మహేశ్వర్ రావు తేల్చి చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకుండా అడ్డుకొనేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉదాసీనంగా వ్యవహరించాయని దేవినేని ఉమా మహేశ్వర్ రావు విమర్శించారు.

ఓ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలవరం ప్రాజెక్టు విషయంలో టిడిపి ప్రభుత్వం ఏ రకమైన అంకిత భావంతో వ్యవహరిస్తోందో ఏపీ రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు వివరించారు.

పోలవరం కాంట్రాక్టు దక్కకనే జగన్ పార్టీ

పోలవరం కాంట్రాక్టు దక్కకనే జగన్ పార్టీ

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కని కారణంగానే వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేశారని ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. వైఎస్ హెలిక్యాప్టర్‌ తప్పిపోయిన రోజే పోలవరం ప్రాజెక్టు టెండర్ల కోసం అప్‌లోడ్ చేశారని, కానీ, ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ బృందానికి ఇచ్చేందుకు అప్పటి కేంద్రం సానుకూలతను చూపలేదని, ఈ కారణంగానే దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు.. ఈ కాంట్రాక్టు దక్కితే జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డారు.పోలవరం ఎర్త్ ర్యాక్ డ్యామ్, పవర్ ప్రాజెక్టు స్పిల్ వే జగన్ బృందానికి ఇచ్చేందుకు ఆనాటి కేంద్రం సానుకూలంగా లేదని ఆయన చెప్పారు.

ట్రాన్స్ ట్రాయ్‌కు చెల్లించింది రూ.650 కోట్లు

ట్రాన్స్ ట్రాయ్‌కు చెల్లించింది రూ.650 కోట్లు

కమీషన్లు తీసుకొనే అలవాటు ఉన్నవారే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు.ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో తాము ప్రయత్నాలు చేస్తోంటే కమీషన్లు తీసుకొన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. విపక్షాల ఆరోపణలను దేవినేని ఉమా మహేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు.ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ఇప్పటికీ సుమారుర 650 కోట్లు బిల్లులు దక్కాయన్నారు. అయితే ఇందులో దేవినేని ఉమా మహేశ్వర్ రావుకు , టిడిపికి ఎన్నికల ఫండ్‌ కింద వేల కోట్లు ఎలా ఇస్తారని దేవినేని ఉమామహేశ్వర్ రావు ప్రశ్నించారు.

2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు

2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడ సానుకూలంగా ఉందని దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబునాయుడు పడుతున్న కష్టాన్ని గడ్కరీ గుర్తు చేశారని దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. ఈ నెల 23వ, తేదిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వర్ రావు గుర్తు చేశారు.2018 నాటికి గ్రావిటీ నిర్మాణం ద్వారా నీరిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు దేవినేని ఉమామహేశ్వర్ రావు చెప్పారు.

గోదావరి పెన్నా అనుసంధానానికి కృషి

గోదావరి పెన్నా అనుసంధానానికి కృషి

గోదావరి పెన్నా నదులను అనుసంధానం చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. ఈ నెల 22వ, తేదిన ఈ విషయమై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించనున్నారని చెప్పారు. ఈ నెల 23, రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందు ఈ ప్రతిపాదనను పెట్టనున్నట్టు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు అంచనా పెంపు

పోలవరం ప్రాజెక్టు అంచనా పెంపు

పోలవరం ప్రాజెక్టు అంచనా పెంపుపై కేంద్రం సానుకూలంగానే స్పందించిందని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 58 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు అంచనాలను సవరిస్తూ ప్రతిపాదనలను పంపారు. అయితే పోలవరం ప్రాజెక్టు బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిందన్నారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఏపీలోని 13 జిల్లాల్లో ఆర్థిక స్థితిగతులు మారే అవకాశం ఉందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు.

English summary
we are committed to release polavaram water in 2018 said Ap irrigation minister Devineni Umamaheswara rao,opposition parties baseless allegations on polavaram project said devineni uma maheshwar rao. A Telugu news channel interviewed him on Sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X