వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎఫెక్ట్: 'నంద్యాల జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలన'

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అధికార, విపక్ష నేతలు హమీల వర్షం కురిపిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అధికార, విపక్ష నేతలు హమీల వర్షం కురిపిస్తున్నారు. నంద్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి చెప్పారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన ఉపఎన్నిక జరగనుంది.ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అధికార టిడిపి, విపక్ష వైసీపీలు వ్యూహలను రచిస్తున్నాయి.

ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామనే విషయాలపై హమీల వర్షం కురిపిస్తున్నారు నేతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు నుండే ఈ నియోజకవర్గంలో పార్టీల హమీలతో నంద్యాల ఓటర్లు తడిసిముద్దౌతున్నారు.

అయితే పోటీలుపడి రెండు పార్టీలకు చెందిన నేతలు ఓటర్లకు హమీలు కురిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై పోలింగ్ రోజున ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారో చూడాల్సి ఉంది.

నంద్యాల జిల్లా ఏర్పాటుపై పరిశీలిస్తాం.

నంద్యాల జిల్లా ఏర్పాటుపై పరిశీలిస్తాం.

నంద్యాలను జిల్లాగా మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. అయితే ఈ నంద్యాలను జిల్లాకేంద్రంగా ఏర్పాటుచేసే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి ప్రకటించారు. దీని విషయమై అధికారులకు ఆదేశాలను ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

Recommended Video

TDP Plans To Keep Check For YS Jagan In MLC Elections - Oneindia Telugu
నంద్యాలనుజిల్లాగా మారుస్తాం

నంద్యాలనుజిల్లాగా మారుస్తాం

ఈ నెల 3వ, తేదిన జరిగిన ఎన్నికల సభలో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాలుగా మార్చనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. అంతేకాదు దీంతో నంద్యాల కూడ జిల్లాగా మారనుంది. ఈ విషయాన్ని జగన్ ప్రకటించారు. వైసీపీ చీఫ్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించడంతో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

టిడిపిదే విజయం

టిడిపిదే విజయం

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం తథ్యమని ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆయన చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేదన్నారు.

జగన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవడం హర్షణీయం

జగన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవడం హర్షణీయం

నంద్యాల సభలో వైసీపీ చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకోవడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు పద్దతుల్లో మాట్లాడడం సమర్ధనీయం కాదన్నారాయన.

English summary
we are examining to convert Nandyal as a district said Ap Deputy chief minister K.E. Krishnamurthy on Sunday.Ysrcp chief Ys Jagan already assured on this in Nandyal sabha recently .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X