వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మనుషులను తినే పులులం కాదు’: ఏపీ అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పట్ల ప్రభుత్వం నిస్సహాయత విధానం సరికాదని హితవు పలికింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చేస్తే ఎలా అని సుప్రీం మొట్టికాయలు వేసింది. అంతేగాక, సుప్రీంకోర్టులో కేసు ఉందనగానే ప్రభుత్వం భయపడుతుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

We Are Not Man-eating Tigers, States Should Not Fear Us: Supreme Court

'మేమేమీ మనుషులను తినే పులులం కాదు' కాదంటూ ఏపీ ప్రభుత్వ దోరణిపై మండిపడ్డింది. ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. ఎవరో ఏదో చేస్తారని ప్రభుత్వమే భయపడిపోతే ఎలా? అని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని సుప్రీం సూచించింది.

English summary
The states should not fear if a matter is pending before the Supreme Court as it is not a "man-eating tiger", the top court has said. "We are not a tiger or something. We are not man-eating tigers. They should not have fear," a bench of Justices Madan B Lokur and Deepak Gupta observed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X