వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ కీలక నేతతో టచ్‌లో: బాంబు పేల్చిన మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసీపీ నేతతో టచ్‌లో అచ్చెన్నాయుడు : రాష్ట్ర రాజకీయాలలో రోజుకో మార్పు

అమరావతి: వైసీపీ చీప్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలో ఆ పార్టీ నుండి పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలను ప్రోత్సహించేలా టిడిపి ప్లాన్ చేస్తోంది. వైసీపీలో ప్రముఖ నాయకుడి కోసం ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన కలకలం రేపుతోంది. వైసీపీ నుండి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉందని ఈ ప్రకటన మరింత బలాన్ని చేకూర్చింది.

బాబుపై ఆసక్తికరం: అద్దం ముందు నిలబడి స్పీచ్ ప్రాక్టీస్, అసెంబ్లీకి హజరైన గిడ్డి ఈశ్వరీబాబుపై ఆసక్తికరం: అద్దం ముందు నిలబడి స్పీచ్ ప్రాక్టీస్, అసెంబ్లీకి హజరైన గిడ్డి ఈశ్వరీ

2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని వైసీపీ చీఫ్ జగన్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు పాదయాత్ర చేస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు.

బాబుపై ప్రశంసలు, త్వరలోనే రాజకీయాల్లోకి, జయప్రద ప్లాన్ ఇదే!బాబుపై ప్రశంసలు, త్వరలోనే రాజకీయాల్లోకి, జయప్రద ప్లాన్ ఇదే!

ఇటీవల కాలంలోనే ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అయితే రాజ్యసభ ఎన్నికలు రానున్న తరుణంలో వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడ దక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో టిడిపి నాయకత్వవ వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. మంగళవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు.

వైసీపీ కీలక నేతపై టిడిపి గురి

వైసీపీ కీలక నేతపై టిడిపి గురి

వైసీపీలో కీలక నేతపై టిడిపి గురి పెట్టింది. వైసీపీలో కీలక నేతను టిడిపిలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. వైసీపీలోని కీలక నేత టిడిపిలో చేరితే వైసీపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.వైసీపీలో కీలక నేతను లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నామని అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన రానున్న రోజుల్లో వైసీపీ నుండి టిడిపిలోకి ఇంకా వలసలు కొనసాగే అవకాశాన్ని తేట తెల్లం చేసింది. అయితే వైసీపీలో కీలకనేతగా ఉన్న ఎవరితో టిడిపి సంప్రదింపులు జరుపుతోందోననే విషయమై టిడిపి మాత్రం స్పందించలేదు.అయితే వైసీపీలో కీలక నేత ఎవరనే విషయమై ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

జగన్ పాదయాత్ర పూర్తయ్యే నాటికి పార్టీలో ఎవరుండరు

జగన్ పాదయాత్ర పూర్తయ్యే నాటికి పార్టీలో ఎవరుండరు

జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ముగించే నాటికి వైసీపీలో ఎవరు ఉండరని మంత్రి అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. తన తల్లి, చెల్లెలు, కొద్ది మంది బంధువులు మాత్రమే వైసీపీలో కొనసాగుతారని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. పాదయాత్ర సాగుతున్న సమయంలోనే వైసీపీ కీలకనేతను టిడిపిలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు.

మరో ఇద్దరిని లాగేందుకు టిడిపి ప్రయత్నం

మరో ఇద్దరిని లాగేందుకు టిడిపి ప్రయత్నం

త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే బలం వైసీపీకి ఉంది. 2014 ఎన్నికల సమయంలో వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. గిడ్డి ఈశ్వరీ చేరికతో వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 23కు చేరుకొంది. దీంతో అసెంబ్లీలో వైసీపీ బలం 44కు పడిపోయింది. దీంతో వైసీపీకి రాజ్యసభ సీటు దక్కాలంటే ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రాజ్యసభకు వైసీపీ పోటీ చేసే బలం లేకుండా చేసేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది.ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు ప్రకటించారు.

రిటైర్ అవుతున్న ప్రముఖులు

రిటైర్ అవుతున్న ప్రముఖులు

ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన వారిలో సినీ నటుడు చిరంజీవి, రేణుకా చౌదరి , టిడిపికి చెందిన దేవేందర్‌గౌడ్ రిటైర్ కానున్నారు.అయితే తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్‌ను ఏపీ కోటాలో వేశారు. ఏపీకి చెందిన సిఎం రమేష్‌ను తెలంగాణ కోటాలో వేశారు.అయితే తెలంగాణ కోటాలో ఉన్నసీఎం రమేష్ కూడ రిటైర్ కానున్నారు.ఏపీ నుండి ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిని బరిలోకి దింపాలంటే కనీసం 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.

English summary
We are planning ysrcp key leader to join in tdp said minister Achenaidu. minister Acheniadu chit chat with media on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X