వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందు లోంగిపోతానని ప్రకటించండి , అడవిలో వైద్య చికిత్స అందిస్తాం :డి.జిపి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి :అడవిలో నక్సలైట్లు ఇంకా ఉన్నారుని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్ కౌంటర్ లో గాయపడిన నక్సలైట్లకు చికిత్స అవసరమని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు. గాయపడిన మావోయిస్టులకు వైద్య సహాయం చేసేందకు తాము సిద్దంగా ఉన్నామని ఆంద్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు ప్రకటించారు.అయితే లొంగిపోతామని మావోలు మీడియా ద్వారా ప్రకటించాలని ఆయన షరతు విధించారు.

ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు గాయపడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో మావోల అగ్రనేతలు ఉండి ఉండవచ్చనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.మావోయిస్టులపై తమకు వ్యతిరేకత లేదన్నారు డిజిపి.సామాన్యులపై అకారణంగా దాడులు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.మావోయిస్టులంటే తమ వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నారు డిజిపి.

we are provide treatment , announce surrender :dgp

మావోల శిబిరం వద్దకు తమ బలగాలు చేరిన వెంటనే మావోల సెంట్రీలు తమపై కాల్పులకు దిగాడన్నారు. ఆత్మరక్షణ కోసం తాము కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు డిజిపితాము అప్రమత్తంగా లేకపోతే తమ వైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.మావోల శిబిరం వద్ద ఉన్న కిట్ బ్యాగులు , ఆయుదాల ఆదారంగా అగ్రనేతలున్నారని డిజిపి అనుమానించారు.ఈ ఘటనలో కొందరు మావోలు గాయపడ్డారని ఆయన అనుమానించారు. వారికి చికిత్స అందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.అయితే లొంగిపోతామని మావోలు ముందుగానే మీడియా ముఖంగా ప్రకటించాలని ఆయన షరతు విధించారు. అవసరమైతే అడవిలోకి వెళ్ళి ట్రీట్ మెంట్ అందిస్తారని చెప్పారు.

ఐదుకొట్ల మందికి మా అండ
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన తనయుడు లోకేష్ ను అంతమొందిస్తామని మావోలు రాసిన లేఖపై కూడ మీడియా సమావేశంలో డిజిపి ఘాటుగానే స్పందించారు. ఈ లేఖ ఎవరు విడుదల చేశారో స్పష్టత లేదన్నారు.ముఖ్యమంత్రి కుటుంబంలోని ఐదుగురితో పాటు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి తమ అండ ఉంటుందన్నారు డిజిపి.మావోల లేఖ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.

English summary
we are provide treatment for injure maoists said andhra pradesh ddp sambhasivarao. who has want tratment announce to the media they are intrest to surrender.we are provide treatment in forest also.we are provide security 5 crores people of ao. not only cms family said dgp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X