వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరణం, జనార్థన్‌ల మధ్య ఆసక్తికరం: ఆత్మాభిమానాన్ని చంపుకోను, చెప్పుడు మాటలు వింటారు

అవును వారిద్దరూ మాట్లాడుకొన్నారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విబేధాలపై మనుసు విప్పారు. పార్టీ నాయకుల ముంగింటే ఒకరిపై మరోకరు తమ అభిప్రాయాలను సమర్థించుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: అవును వారిద్దరూ మాట్లాడుకొన్నారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విబేధాలపై మనుసు విప్పారు. పార్టీ నాయకుల ముంగింటే ఒకరిపై మరోకరు తమ అభిప్రాయాలను సమర్థించుకొన్నారు. అంతేకాదు మధ్య మధ్యలో ఒకరి చెవిలో మరోకరు గుసగుసలాడారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా టిడిపిలో ఆసక్తి కల్గించింది. చాలాకాలంగా ఎడముఖం, పెడ ముఖంగా ఉన్న కరణం బలరాం, దామరచర్ల జనార్థన్‌లు కొద్దిసేపు ముచ్చటించారు. అభిప్రాయబేధాలను పరిష్కరించుకొనేందుకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకొన్నారు. ఈ పరిణామం టిడిపి నేతల్లో ఆనందానికి కారణమైంది.

ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?

టిడిపి ప్రకాశం జిల్లా నేతల మధ్య సమన్వయం కొరవడింది. పార్టీ సీనియర్ నాయకడు కరణం బలరామ్‌తో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థన్‌ మద్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

నియోజకవర్గాలవారీగా డేటా సేకరణ, నేతలతో ఇక తాడోపేడో బాబు షాకింగ్ నిర్ణయంనియోజకవర్గాలవారీగా డేటా సేకరణ, నేతలతో ఇక తాడోపేడో బాబు షాకింగ్ నిర్ణయం

ఇటీవల కాలంలో అద్దంకిలో చోటుచేసుకొంటున్న పరిణామాలు కరణం బలరాంతో జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థ‌న్‌కు మరితం అగాధాన్ని పెంచుతున్నాయి.అయితే ఈ గ్యాప్‌ను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

తాజగా ఈ తరహ ఘటన ఒకటి బుదవారంనాడు ఒంగోలులో చోటుచేసుకొంది. దామరచర్ల జనార్థన్, కరణం బలరాం మనసువిప్పి మాట్లాడుకొన్నారు. పార్టీలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.

మనసువిప్పి మాట్లాడుకొన్న కరణం బలరాం, దామరచర్ల జనార్ధన్

మనసువిప్పి మాట్లాడుకొన్న కరణం బలరాం, దామరచర్ల జనార్ధన్

టిడిపి ప్రకాశం జిల్లాలో ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థన్‌లు వ్యవహరిస్తున్నారు. తమ మధ్య అభిప్రాయబేధాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఎవరికీ వారు తామే కరెక్ట్ అంటూ సమర్ధించుకొన్నారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు వంగ్యాస్త్రాలను సంధించుకొన్నారు. అయితే అద్దంకి వ్యవహరాలతో పాటు కొన్ని విషయాలపై ఒకరికొకరు చెవిలో గుసగుసలాడుకొన్నారు.

Recommended Video

List Came Out : Chandra Babu Naidu Changed AP Cabinet Ministers - Oneindia Telugu
కరణం వస్తున్నాడని చెప్పగానే దామరచర్ల ఇలా

కరణం వస్తున్నాడని చెప్పగానే దామరచర్ల ఇలా

ఒంగోలులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో బుదవారం నాడు ఎమ్మెల్సీ కరణం బలరాం, టిడిపి జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్ధన్ కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. తొలుత ఈ కార్యక్రమానికి దామరచర్ల జనార్థన్ హజరయ్యారు. వేరే కార్యక్రమాలు ఉన్నాయంటూ జనార్ధన్ వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే నిర్వాహకులు మాత్రం కరణం బలరాం వస్తున్నారని చెప్పి కొద్దిసేపు వేచి ఉండాలని కోరారు. అదే సమయంలో కరణం బలరాం అక్కడికి చేరుకొన్నారు.ఇద్దరూ పక్కపక్కనే కూర్చొన్నారు. కొద్దిసేపు ముక్తసరిగా మాట్లాడుకొన్నారు.

విబేధాలపై నోరు విప్పారు.

విబేధాలపై నోరు విప్పారు.

మీ ఇద్దరి మధ్య విబేధాలు పార్టీ శ్రేణులకు ఇబ్బందులు కల్గిస్తున్నాయని పార్టీకి చెందిన నాయకుడు చెప్పాడు. దీంతో ఇద్దరు నేతలు కూడ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ వాదనలను సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. జనార్ధన్ మనసులో అరమరికలు ఉంటాయనే అనుమానం ఉందని ఎమ్మెల్సీ కరణం బలరాం వ్యాఖ్యానించారు. నాకు అలాంటిదేమీలేదు, మీరే అనుమానపడుతున్నారు,. చెప్పుడు మాటలు వింటున్నారని కరణంతో అన్నారు దామరచర్ల. అయితే చెప్పుడు మాటలు జనార్ధన్ వింటున్నారని కరణం బలరాం కౌంటర్ వేశారు. అయితే సీనియర్ల మాటలను గౌరవిస్తూ వారి సలహలను తీసుకొనే చొరవ కూడ ఉండాలని కరణం అన్నారు.

చంద్రబాబు దారి

చంద్రబాబు దారి

తమ మధ్య వ్యక్తిగత విబేధాలు లేవని వారిద్దరూ కూడ ప్రకటించారు. అంతేకాదు తనకు, జనార్ధన్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయా, రాజకీయంగా కొన్ని విబేధాలున్న మాట వాస్తవమేనని కరణం అన్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకొంటే ఇవన్నీ పరిష్కారం అవుతాయన్నారు. దామరచర్ల మసులో 14 అరలుంటాయని కరణం వ్యాఖ్యానించడంతో దామరచర్ల సీరియస్‌గా స్పందించారు. చెప్పుడు మాటలు విని అందరికీ దూరమైంది మీరేనని చెప్పారు. ఆ విధానాన్ని మానుకొంటే సమస్యలు ఉండవని ఆయన బలరాం‌కు నవ్వుతూనే చెప్పారు. ఎవరైనా మధ్యవర్తి ప్రయత్నిస్తే ఇద్దరం కలిసి మాట్లాడుకొంటామన్నారు బలరాం. అయితే రాజకీయ విబేధాలు ఉన్న మాటను ఒప్పుకొన్నారు. కానీ, తమ ఇద్దరిదీ కూడ చంద్రబాబు దారే అంటూ చెప్పడం విశేషం.

ఆత్మాభిమానాన్ని చంపుకోను

ఆత్మాభిమానాన్ని చంపుకోను

పార్టీ కోసం ఎన్నిమెట్లైనా దిగుతానని దామరచర్ల జనార్ధన్ ప్రకటించారు. అయితే అదే సమయంలో ఆత్మాభిమానాన్ని చంపుకోనని చెప్పారు. దేవరపల్లి దళితుల సమస్యతో పాటు అద్దంకి నియోజకవర్గంలో చోటుచేసుకొన్న పరిణామాలపై కూడ వారిద్దరి మధ్య చర్చ సాగింది. అయితే గొట్టిపాటి రవితో పార్టీలోకి వచ్చినవారి వల్ల మొదటి నుండి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరగకుండా చూస్తామని జనార్ధన్ బలరాం‌కు చెప్పారు.

English summary
Tdp MLC Karanam Balaram and Ongole Mla Damacharla Janardhan discussed party issues on Wednesday at Ongole. We are work together for party they said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X