వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"వాటిని తొలగించాల్సిందే.. అవసరమైతే సీఎం ఇంటినైనా, తూచా తప్పకుండా.."

సింగపూర్‌ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాల్సి వస్తుంది గనుక.. ఈ చిక్కుల్ని అధిగమించేందుక

|
Google Oneindia TeluguNews

అమరావతి: పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని గ్రీన్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను పరిశీలిస్తోంది.

నిబంధనల మేరకు లేని నిర్మాణాలను తొలగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడి ఇంటినైనా తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

వాటిని తొలగించాల్సిందే:

వాటిని తొలగించాల్సిందే:


కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇదే విషయమై మంత్రి నారాయణను కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను ఏం చేస్తారని అడిగారు. నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.

సీఎం నివాసంపై

సీఎం నివాసంపై


ప్రస్తుతం ఉన్న నిర్మాణాల్లో.. ఏ నిర్మాణాలు కరకట్టకు 100మీ. లోపల ఉన్నాయన్నది పరిశీలిస్తామన్నారు మంత్రి నారాయణ. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే సీఎం ఇంటినైనా తొలగిస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే నిర్మాణాలు జరగాలన్న ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు.. ఒక డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సంబంధిత మంత్రిత్వ శాఖ ఇచ్చిందన్నారు. ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు.

సింగపూర్ కంపెనీలకు ఇస్తాం:

సింగపూర్ కంపెనీలకు ఇస్తాం:


రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్‌ ఏరియాలో మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు నారాయణ. ఆపై దాన్ని సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తామని తెలిపారు. ఇదే విషయమై ఇటీవల సీఎంతో భేటీ అయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో చర్చించామని అన్నారు.

దానివల్ల ఇబ్బందులు

దానివల్ల ఇబ్బందులు


సింగపూర్‌ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాల్సి వస్తుంది గనుక.. ఈ చిక్కుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్‌ కంపెనీలకు ఇస్తామని, వారు లేఅవుట్లు వేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వాటిని విక్రయిస్తారని తెలియజేశారు.

English summary
AP Minister Narayana responded over National Green Tribunal verdict over Capital construction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X