• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేము ఆ మాటంటే ఎలా ఉంటుంది...అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు:వైసిపి

|

న్యూఢిల్లీ:పక్కా పథకం ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని...ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, హర్షవర్దన్, శివాజీలు భాగస్వాములని వైసిపి నేతలు ఆరోపించారు.

న్యూఢిల్లీలో వైసిపి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుందని...అసలు వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ పార్టీ విచారణ జరగాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తో సిఎం చంద్రబాబు అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడిస్తున్నారని వైసిపి నేతలు మండిపడ్డారు.

మీడియా సమావేశంలో...వైసిపి నేతలు

మీడియా సమావేశంలో...వైసిపి నేతలు

తనపై హత్యాయత్నం కేసులో థర్డ్ పార్టీ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జగన్ రాసిన లేఖను అందచేసిన వైసిపి ముఖ్య నేతలు న్యూ ఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, బొత్సా సత్యనారాయణ తదిదరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..."వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పిస్తున్నారు. అలిపిరి ఘటన మావోయిస్టులు చేసింది కాదు.. భువనేశ్వరి చేయించిందంటే ఒప్పకుంటారా? చంద్రబాబును హత్య చేయాలని భువనేశ్వరి అనుకుందని మేమంటే ఎలా ఉంటుంది?... కానీ అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు"...అన్నారు.

  జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు? | Why Srinivas Rao Did That Attempt Ys Jagan on that day only?
   పథక ప్రకారమే...ఆరోపణ

  పథక ప్రకారమే...ఆరోపణ

  పక్కా పథకం ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని...ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, హర్షవర్దన్, శివాజీలు భాగస్వాములని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయపడితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన తిరుపతికి వెళ్లి పరామర్శించారని...చంద్రబాబుపై దాడికి నిరసనగా ధర్నా చేశారని...కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్న సంఘటనను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.

  ఆ వ్యాఖ్యలు...విడ్డూరం

  ఆ వ్యాఖ్యలు...విడ్డూరం

  పైగా ఈ హత్యాయత్నాన్ని ఖండించిన నేతలను...గవర్నర్‌ను కూడా చంద్రబాబు తప్పుబట్టారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. నిందితుల గురించి డీజీపీ చెప్పడం దారుణమని...ఏపీ పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుందని...అసలు వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ పార్టీ విచారణ జరగాల్సిందేనని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపి మేకపాటి మాట్లాడుతూ జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ కుట్రతో హత్యాయత్నానికి పాల్పడిందని...పాత్రధారుడిపైనే కాదు సూత్రదారులపైనా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.

  డీజీపీ ప్రకటన..దారుణం

  డీజీపీ ప్రకటన..దారుణం

  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం పాపులారిటీ కోసమే చేశారని డీజీపీ చెప్పడం దారుణమని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. డీపీపీ ప్రకటన విచారణను నీరుగార్చేలా ఉందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణపాయం తప్పిందన్నారు. వైఎస్‌ జగన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ‍్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే శ్రీనివాస్‌ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అండలేకుంటే క్రిమినల్‌ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్‌వోసీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. క్యాంటీన్‌ యజమాని హర్ష వర్దన్‌ చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడని ఆరోపించారు. నిజాలు బయటపడాలంటే కేంద్ర సంస్థతలతోనే దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

   ఆ మాటలా...సంస్కారం లేదు...

  ఆ మాటలా...సంస్కారం లేదు...

  వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని పోలీస్‌ రిమండ్‌ రిపోర్ట్‌లో స్పష్టమైనా.. సీఎం చంద్రబాబు నాయుడు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత వరప్రసాద్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం, డీజీపీ చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్‌ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలచే విచారణ చేయిస్తే నిజాలు బటయకొస్తాయని వరప్రసాద్‌ పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YCP leaders said, “We demand third party inquiry from other than AP police. That can unearth facts and punish the culprit”. They also added TDP government is misleading people and sidtracking the investigation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more