వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవట్లేదు, అందుకే కర్నాటకలో ఓటు వేయవద్దని చెప్పాం: కేఈ

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తాము పట్టించుకోవడం లేదని టీడీపీ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఏపీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధాని మోడీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఏపీకి మోడీ చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీకి ఓటు వేయవద్దని కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చినట్లు చెప్పారు. వైసీపీ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు టీడీపీనే విశ్వసిస్తారన్నారు.

We dont care about Pawan Kalyan, says KE

బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి: బీజేపీ మాలతి

ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతీరాణి ఆదివారం డిమాండ్‌ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేసిన దీక్షలో బాలకృష్ణ ప్రసంగిస్తూ ప్రధానితో పాటు ఆయన తల్లి, సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

బట్టలూడదీసి కొడదాం! త్వరలో: ఆర్కేకు పవన్ ట్వీట్ వార్నింగ్, టీవీ9 రవిప్రకాశ్ చెప్పుతో దాడి అంటూ..బట్టలూడదీసి కొడదాం! త్వరలో: ఆర్కేకు పవన్ ట్వీట్ వార్నింగ్, టీవీ9 రవిప్రకాశ్ చెప్పుతో దాడి అంటూ..

చవకబారు వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌కు ఉన్న ఖ్యాతిని మంటగలిపారన్నారు. గతంలో వివిధ కేసుల్లో ఇరుక్కొని మానసిక స్థితి సరిగా లేదని బయటపడిన వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని చెప్పారు.

English summary
Andhra Pradesh Deputy Chief Minister KE Krishnamurthy on Monday said that we dont care Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X