వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనాథలుగా వదిలేసిన మాకు వాడెందుకు :మావోయిస్టు కిరణ్ తల్లిదండ్రులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

తాళ్ళపూడి :తమ ను అనాథలుగా వదిలిన కొడుకు గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మావోయిస్టు కిరణ్ తల్లిదండ్రులు.పదేళ్ళుగా తాము చచ్చామో బతికామో కూడ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తాళ్ళపూడి మండలం ములకపల్లి గ్రామానికి చెందిన గడ్డం సువర్ణరాు అలియాస్ కిరణ్ ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించారు.ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం కల్గించింది.బ్రహ్మనందం, అన్నమ్మ దంపతుల చిన్న కొడుకు కిరణ్ పదేళ్ళు క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.మావోయిస్టు పార్టీలో చేరిన నాటి నుండి ఆయన ఒక్కసారి కూడ గ్రామానికి రాలేదు. తల్లిదండ్రులతో మాట్లాడలేదు.

We dont want my son:maoist kiram parents

ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో కిరణ్ మరణించాడు.ఈ విసయాన్ని స్ధానిక మీడియా ప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.కిరణ్ మరణించిన విషయం అప్పటివరకు వారికి తెలియలేదు. బ్రహ్మనందానికి ఇద్దరు కొడుకులున్నారు. 2009 లో బ్రహ్మనందం పెద్ద కొడుకు హాత్యకు గురయ్యాడు. అప్పటికే మావోయిస్టు పార్టీలో చేరిన కిరణ్ ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించాడు. వృద్దాప్యంలో ఉన్న తమ ఆలనా పాలనా చూసే వారే లేరని ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

బ్రహ్మనందానికి ఇటీవలే కడుపులో కణుతులు రాగా, ఆపరేషన్ చేసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బందిపడుతున్నారు. కిరణ్ మరణించిన విషయం తమకు తెలియదంటున్నారు. తమను అనాథలుగా వదిలిన కొడుకు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కిరణ్ తల్లిదండ్రులు.

English summary
we dont want my son said maoist kiran parents, in oldage how can live asked kiran parents, we are suffering illness, our eledrson murdered in 2009,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X