వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై దాడి చేసే సమయం మాకు లేదు, ఏ గుహలోకి వెళ్తారో చూసే తీరికలేదు: సోమిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తమ పార్టీ పండుగ మహానాడు సక్సెస్ కావడంతో ప్రత్యర్థి పార్టీలకు కడుపు మండుతోందని టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం అన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారిద్దరికి ఏమాత్రం గట్స్ ఉన్నా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

అర్ధరాత్రి సమయంలో తాను ఉంటున్న కళ్యాణ మండపంలో కరెంట్ కట్ చేయించి రౌడీలతో దాడులు చేయించే ప్రయత్నాలు చేశారన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ పైన దాడులు చేసేంత సమయం మాకు లేదన్నారు. పవన్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏ గుళ్ల వెంట తిరుగుతారో, ఏ గుహళ్లోకి వెళ్లారో చూసే తీరిక తమకు లేదన్నారు.

అవసరమైతే జగన్‌తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్ అవసరమైతే జగన్‌తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్

We have no time to attach Pawan Kalyan, says Somireddy

ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఏపీకి కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదని యనమల రామకృష్ణుడు వేరుగా చెప్పారు. కావాలనే నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు యూసీల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. యూసీలు సమర్పించడంలే దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ఏపీ ఎప్పటికి అప్పుడు యూసీలు అందజేస్తోందన్నారు.

Recommended Video

JanaSena Chief Pawan Kalyan Speech, Tekkali - JANASENA PORATA YATRA DAY4

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నిధులు ఎగ్గొట్టేందుకు ఇదో కొత్త నాటకం అన్నారు. యూసీలు ఇవ్వకుండా కేంద్రం నిధులు విడుదల చేయదన్నారు. ఈ విషయాన్ని అమిత్ షా తెలుసుకుంటే బాగుంటుందన్నారు.

English summary
Telugudesam Party leader and Minister Somireddy Chandramohan Reddy on Monday said that they have no time to attack Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X