కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి సిఎం నుంచి మాకు ప్రాణభయం ఉంది: గంగిరెడ్డి భార్య, అంతకష్టమెందుకన్న జూపూడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన భర్తను ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి భార్య మాళవిక. శనివారంరం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తమకు ప్రాణ హాని ఉందని, దీనిపై ఇదివరకే గవర్నర్‌కు కూడా ఓ లేఖ రాశామని ఆమె చెప్పారు. ఆ తర్వాతే గంగిరెడ్డిని టార్గెట్ చేశారన్నారు. గంగిరెడ్డికి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

 We have threat from AP Govt, says Gangi Reddy's wife

ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటే అంతకష్టపడటం ఎందుకు?: జూపూడి

స్మగ్లర్‌ గంగిరెడ్డి తమవాడని వైయస్సార్ కాంగ్రెస్ ముద్ర వేసుకుందని తెలుగుదేశం నేత జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికి ఎవరి ద్వారా ప్రాణహాని ఉండదని ప్రశ్నించారు.

గంగిరెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలనుకుంటే పోలీసులు అంతకష్టపడి ఎందుకు పట్టుకుంటారని అన్నారు. గంగిరెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్న అతని భార్య మాళవిక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్లో వాస్తవం లేదని జూపూడి కొట్టిపారేశారు.

ఇది ఇలా ఉండగా, మారిషస్‌ నుంచి గంగిరెడ్డిని తీసుకొచ్చిన తర్వాత మొదట కర్నూలుకే తీసుకుని వస్తారని జిల్లా పోలీసులు అనుకున్నారు. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఓ హత్యకేసులో ఇంకా శిక్ష అనుభవించా ల్సి ఉండటంతో దానికి ప్రాధాన్యం ఇచ్చి గంగిరెడ్డిని అక్కడి కోర్టులో హాజరు పరిచారు.

వెల్దుర్తి వద్ద దొరికిన ఎర్రచందనం డంప్‌ కేసులో సబ్‌జైలులో ఉంటూ హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చిన గంగిరెడ్డి ఆ తర్వాత పరారయ్యాడు. దాంతో కర్నూలు జిల్లా డోన్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆ వారెంటు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అదే విధంగా ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో దొరికిన ఎర్రచందనం దుంగల కేసులో కూడా గంగిరెడ్డి పదో నిందితుడిగా ఉన్నాడు.

ఈ కేసులో కూడా నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ అమలులో ఉంది. ఈ రెండు వారెంట్లతో గంగిరెడ్డిని ఆళ్లగడ్డ, డోన్‌ కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. దీంతో కర్నూలు జిల్లా పోలీసులు గంగిరెడ్డి కస్టడీ కోసం నేడో, రేపో పిటిషన్‌ దాఖలు చేసే అవ కాశం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి మారిషస్‌లో ఉండగా అక్కడి న్యాయ సాయం కోసం ఖర్చుచేసిన నేతలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌కు చెందిన కొంతమంది న్యాయవాదులు నంద్యాల ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖుడి ఆ దేశాలతో ప్రతిసారీ మారిషస్‌వెళ్లి గంగిరెడ్డి తరుపున వాదనలు వినిపించినట్లు సమాచారం. ఇందుకోసం ఫీజుల రూపంలో గంగిరెడ్డి చెల్లించినట్లు తెలిసింది.

గంగిరెడ్డి జైలులో ఉండడంతో పాటు అతడి బ్యాంకు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు పోలీసులు స్తంభింపజేసిన నేపథ్యంలో అతనికి అంత మొత్తంలో ఆర్థిక సాయం అందించింది ఎవరు? అంత పెద్దమొత్తంలో గంగిరెడ్డి కోసం ఖర్చు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమే మిటి? గతంలో వీరికి, గంగిరెడ్డికి మధ్య వ్యా పార సంబంధాలు ఉన్నాయా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దొరికిన ఎర్రదుంగల కేసులో చాగలమర్రి ఎంపీపీ మస్తాన్‌వలీ, గంగిరెడ్డి నిందితులుగా ఉన్నారు. మస్తాన్‌వలీ కూడా పలు సార్లు గం గిరెడ్డిపై ప్రస్తావన తీసుకవచ్చారు. వెల్దుర్తి దగ్గర దొరికిన డంప్‌లో డైరీ ఆధారంగా పలు వివరాలు అప్పట్లో వెలుగులోకి వచ్చా యి.

English summary
International smuggler Gangi reddy's wife Malavika on Saturday said that she and her husband have threat from AP Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X