వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పటివరకు ఓపికగా ఉంటాం, రాజకీయ నిర్ణయం తీసుకొంటాం: ఆది సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్నికల సమయంలో బుందేల్‌ఖండ్ కోసం ఇచ్చిన హమీని కేంద్రం అమలు చేసిందని ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు.కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగేళ్ళు దాటినా కానీ, ఎందుకు హమీలను అమలు చేయలేదని ప్రశ్నించారు.ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే రాజకీయ నిర్ణయం తీసుకొంటామని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు.

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే మార్చి 5వ, తేది నుండి పార్లమెంట్‌లో పోరాటం కొనసాగించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.

ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పార్టీలన్నీ పోరాటబాట పట్టాయి. మరో వైపు ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చింది. ఏపీలోని రాజకీయపార్టీలన్నీప్రత్యేక హోదా అంశాన్ని ప్రచార అస్ర్తంగా మార్చుకొంటున్నాయి.

రాజకీయ నిర్ణయం

రాజకీయ నిర్ణయం

ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చకపోతే రాజకీయ నిర్ణయం తీసుకొంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో బుందేల్‌ఖండ్ కోసం ఇచ్చిన హమీని కేంద్రం నెరవేర్చిందన్నారు. కానీ ఏపీకి ఇచ్చిన హమీలను 4 ఏళ్ళు దాటినా ఎందుకు అమలు చేయలేదని మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.

ఆ హమీలు నెరవేర్చాల్సిందే, కేంద్రం పోరాటమే: బాబు షాకింగ్ కామెంట్స్ఆ హమీలు నెరవేర్చాల్సిందే, కేంద్రం పోరాటమే: బాబు షాకింగ్ కామెంట్స్

మోడీ ఏం చేస్తారో చూద్దాం

మోడీ ఏం చేస్తారో చూద్దాం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే ఏపీ రాష్ట్రానికి వస్తారనే వార్తలు వస్తున్నాయని చెప్పారు.అయితే ఏపీకి మోడీ వచ్చిన తర్వాత ఏం ప్రకటిస్తారో చూడాలని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిందేనని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు.

బాబు గొప్పతనం తెలిసింది

బాబు గొప్పతనం తెలిసింది

సినీ నటుడు కమల్‌హసన్ రాజకీయ పార్టీ ఏర్పాటు సమయంలో తన హీరో చంద్రబాబునాయుడని చెప్పిన విషయాన్ని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గొప్పతనం కమల్ హసన్ ప్రశంసలతో తెలిసిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు.

మూడేళ్ళు ఓపిక పట్టాం

మూడేళ్ళు ఓపిక పట్టాం

మూడేళ్ళుగా ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన హమీలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ చెప్పారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హమీలను నెరవేర్చకపోయినా ఓపిక పట్టినట్టు కొనకళ్ళనారాయణ చెప్పారు. మార్చి 5వ, తేదివరకు వేచి చూస్తామని కొనకళ్ళ నారాయణ చెప్పారు. అప్పటికీ కూడ హమీలను నెరవేర్చకపోతే పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగిస్తామని నారాయణ చెప్పారు.

English summary
Ap Marketing minister Adinarayana Reddy sensational comments on Bjp. If NDA government not fulfilled its promises to Andhra Pradesh, we'll take a political decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X