వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌తోనే ఉంటూ గద్దెదించారు, రాజమండ్రి సీటిస్తానంటే వద్దన్నా:మురళీమోహన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాత్రికి రాత్రే ఎన్టీఆర్‌ను గద్దెదించేశారని , ఈ ఘటనకు కొద్దిగంటల ముందే ఎన్టీఆర్‌తో కలిసి తాము కలిసి భోజనం చేసి వచ్చామన్నారు. కానీ, రాత్రికి రాత్రే ఎన్టీఆర్ ను గద్దె దించేసి నాదెండ్ల భాస్కర్ రావు సీఎంగా ఎన్నికయ్యారని రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ గుర్తు చేసుకొన్నారు. నెలరోజుల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సీఎం పీఠాన్ని దక్కించుకొన్నారని చెప్పారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్రంలో ప్రచారం నిర్వహించినట్టు మురళీమోహన్ చెప్పారు.

నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతం తర్వాత మళ్ళీ సీఎంగా ఎన్నికైన ఎన్టీఆర్ ఒక్కరోజు ఫోన్ చేసి రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని టిడిపి నేత ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చెప్పారు. కానీ, రాజకీయాల్లోకి రావడానికి ఆనాడు తన కుటుంబసభ్యులు అంగీకరించలేదని మురళీమోహన్ చెప్పారు.తనను రాజకీయాల్లోకి రావాలని ఆనాడు చంద్రబాబునాయుడు సహ కొందరు టిడిపి నేతలు ఒప్పించేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు.

ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో అనుబంధం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వనించడంతో పాటు ఎన్టీఆర్‌ను గద్దెదించిన సమయంలో ఎన్టీఆర్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించడం వంటి ఘటనలను రాజమండ్రి ఎంపీ మురళిమోహన్ గుర్తు చేసుకొన్నారు.

ఎన్టీఆర్ రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తానంటే వద్దనంటూ మురళీమోహన్ చెప్పారు అయితే తనకు బదులుగా పోటీ చేసిన మరో వ్యక్తి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని మురళీమోహన్ చెప్పారు.

రాత్రికి రాత్రే ఎన్టీఆర్‌ను పదవి నుండి తొలగించారు

రాత్రికి రాత్రే ఎన్టీఆర్‌ను పదవి నుండి తొలగించారు

గుండె ఆపరేషన్ చేసుకొని హైద్రాబాద్‌కు తిరిగివచ్చిన ఎన్టీఆర్‌ను రాత్రికి రాత్రే నాదెండ్ల భాస్కర్ రావు ఘటన చోటు చేసుకొందని మురళీమోహన్ చెప్పారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించారని మురళీమోహన్ చెప్పారు. కొన్ని గంటల ముందే తనతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎన్టీఆర్‌ను కలిసి చెన్నైకు చేరుకొనేలోపుగానే ఈ ఘటన చోటు చేసుకొందన్నారు. తాము ఎన్టీఆర్‌తో మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ తో ఎక్కువ సేపు మాట్లాడకూడదంటూ తమను పంపించేసిన కొందరు టిడిపి నేతలు ఆనాడు నాదెండ్ల గ్రూపులోనే ఉన్నారని ఆ తర్వాత తెలిసిందని మురళీమోహన్ చెప్పారు.విషయం తెలుసుకొని మళ్ళీ తాము హైద్రాబాద్‌కు తిరిగివచ్చినట్టు మురళీమోహన్ చెప్పారు. విషయం తెలుసుకొన్న ఎన్టీఆర్ ఆవేశంతో ఊగిపోయారని మురళీమోహన్ చెప్పారు.

బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు

ఎన్టీఆర్ కోసం రాష్ట్రంలో పర్యటించాం

ఎన్టీఆర్ కోసం రాష్ట్రంలో పర్యటించాం

ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్‌రావు గద్దెదించిన తర్వాత తాను, రావుగోపాలరావు కలిసి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై ప్రజల్లో ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు. ఆ సమయంలో ప్రజలకు అర్ధమయ్యేలా తాము చేసిన ప్రచారం కలిసివచ్చిందన్నారు. తమతో పాటు మరికొందరు సినీ తారలు కూడ ఈ రకమైన ప్రచారాన్ని నిర్వహించారని ఆయన గుర్తు చేసుకొన్నారు. నెలరోజుల పాటు ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ మళ్ళీ సీఎంగా గద్దెనెక్కారని మురళీమోహన్ గుర్తు చేసుకొన్నారు.

ఇందిరా ముందే ఊహించింది, ఎన్టీఆర్‌ కారును తిరుపతిలోకి రానివ్వలేదు: మురళీమోహన్ ఇందిరా ముందే ఊహించింది, ఎన్టీఆర్‌ కారును తిరుపతిలోకి రానివ్వలేదు: మురళీమోహన్

రాజమండ్రి ఎ:పీ సీటు ఇస్తానని ఎన్టీఆర్ ఫోన్ చేశారు.

రాజమండ్రి ఎ:పీ సీటు ఇస్తానని ఎన్టీఆర్ ఫోన్ చేశారు.

తాను సినిమాల్లో బిజీగా ఉన్న కాలంలో చెన్నైలో ఉండేవాడినని మురళీమోహన్ చెప్పారు. అయితే ఆ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఘటన తర్వాత ఎన్టీఆర్ తనకు ఫోన్ చేశారని మురళీమోహన్ గుర్తుకు చేసుకొన్నారు. రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్ చేశారు. రాజమండ్రిలో పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయారని, తాను పోటీ చేస్తే రెండు గ్రూపులు కలిసి మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నాయని ఎన్టీఆర్ గుర్తు చేశారు. అయితే తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఎన్టీఆర్ ను కోరినట్టు మురళీమోహన్ చెప్పారు.

అందుకే ఆనాడు ఎంపీ సీటు వద్దనుకొన్నా

అందుకే ఆనాడు ఎంపీ సీటు వద్దనుకొన్నా


రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తానని ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చిన విషయాన్ని కుటుంబసభ్యులతో చర్చించినట్టు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గుర్తు చేసుకొన్నారు. కానీ, ఆనాడూ తాను రాజకీయాల్లోకి రావడానికి ఎవరూ అంతగా ఆసక్తిని చూపలేదని మురళీమోహన్ చెప్పారు.దీంతో నేరుగా హైద్రాబాద్‌కు వచ్చి నేరుగా అదే విషయం చెప్పినట్టు మురళీమోహన్ చెప్పారు చంద్రబాబునాయుడితో పాటు చాలామంది టిడిపి నేతలు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని మురళీమోహన్ చెప్పారు.

English summary
Rajahmundry MP Murali Mohan said that suddenly NTR was removed from the CM.A Telugu news paper interviewed him recently.we were campaigned for ntr against nadella bhaskar rao said Murali mohan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X