వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలం లేకున్నా రెండు దఫాలు టిడిపి విజయం, కర్నూల్‌లో మారిన సీన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది.2014లో ఏపీలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.దీంతో కర్నూల్ జిల్లాలో కూడ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.దీంతోనే ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ అభ్యర్థి గౌరు వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు.

రంగంలోకి కెఈ: సోదరుడికి టిక్కెట్టు కోసమిలా, అభ్యర్ధి లేకుండానే టిడిపి ప్రచారంరంగంలోకి కెఈ: సోదరుడికి టిక్కెట్టు కోసమిలా, అభ్యర్ధి లేకుండానే టిడిపి ప్రచారం

కర్నూల్ జిల్లాలో 2014 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.

కర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక

ఇటీవలనే వైసీపీ నుండి టిడిపిలో కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక కూడ చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా టిడిపి అభ్యర్థి ఎంపిక చేసే విషయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బుట్టా రేణుక కూడ హజరయ్యారు.

కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వరుస ఓటములతో వైసీపీకి అగ్ని పరీక్ష, అభ్యర్థెవరు?కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వరుస ఓటములతో వైసీపీకి అగ్ని పరీక్ష, అభ్యర్థెవరు?

ఆపరేషన్ ఆకర్ష్‌తో స్థానిక సంస్థల్లో టిడిపి ఆదిపత్యం

ఆపరేషన్ ఆకర్ష్‌తో స్థానిక సంస్థల్లో టిడిపి ఆదిపత్యం

కర్నూల్ జిల్లాలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అయితే జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులతో వైసీపీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు టిడిపిలో చేరారు. దీంతో స్థానిక సంస్థల్లో కూడ టిడిపి తన బలాన్ని పెంచుకొంది.2014 లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి బలం 480, వైసీపీ బలం 511, ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు 93 మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.టిడిపి బలం660, వైసీపీ బలం346కు పడిపోయిందని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇతరుల సంఖ్య కూడ 74కు తగ్గింది.

Recommended Video

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు, ట్విస్ట్ లే ట్విస్ట్ లు !
రెండుసార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం

రెండుసార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు దఫాలు శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు.2015 లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి 127 ఓట్లతో విజయం సాధించారు. ఆ సమయంలో టిడిపికి బలం లేకున్నా ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఏడాది మార్చి7న, జరిగిన ఎన్నికల్లో కూడ శిల్పా చక్రపాణిరెడ్డి మరోసారి 62 ఓట్ల తేడాతో గౌరు వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు.అయితే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపి నుండి వైసీపీలో చేరారు.దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

 వైసీపీ ఎన్నికలకు దూరంగా

వైసీపీ ఎన్నికలకు దూరంగా

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది.అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొంటే ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తికానుంది. ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం లేకపోలేదు.

ఎన్నికలు జరిగిన ఢోకా లేదంటున్న టిడిపి

ఎన్నికలు జరిగిన ఢోకా లేదంటున్న టిడిపి

కర్నూల్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగినా గెలుపుకు ఢోకా లేదని టిడిపి నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మారిన రాజకీయ సమీకరణల అనంతరం టీడీపీ బలం 660, వైసీపీ ఓటర్లు 346, ఇతరులు 74 మంది ఉన్నారని టిడిపి అంచనా వేస్తోంది. వైసీపీ పోటీలో ఉన్నా 271 పైచిలుకు ఓట్లతో విజయం తమదేనని టీడీపీ అభిప్రాయపడుతోంది.

English summary
We will be win in Kurnool mlc elections over 200 votes majority said Tdp leaders.kurnool local body mlc elections will be conduct 2018 Jan 11 MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X