తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ భూములను అమ్మనివ్వం: నా ప్రయత్నాలు అమరావతిలో సక్సెస్: ఇక్కడా అదే ఫార్ములా

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఊహించినట్టే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక ఆస్తుల విక్రయాల్లో భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకుంది. శ్రీవారికి చెందిన స్థిరాస్తుల్లో నిరర్థకంగా పడి ఉన్న భూములను విక్రయించడానికి టీటీడీ పాలక మండలి చేస్తోన్న ప్రయత్నాలు బెడిసి కొట్టేలాగే కనిపిస్తున్నాయి. దీనిపై బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు న్యాయపోరాటానికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. న్యాయపోరాటానికి దిగబోతోంది. త్వరలోనే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో విమానం ఎక్కాలంటే సవాలక్ష ఆంక్షలు: టికెట్లను నేరుగా కొనలేం: అక్కడి నుంచి ఎవరొచ్చినాఏపీలో విమానం ఎక్కాలంటే సవాలక్ష ఆంక్షలు: టికెట్లను నేరుగా కొనలేం: అక్కడి నుంచి ఎవరొచ్చినా

ఈ దిశగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆస్తులను విక్రయించకుండా ఉండటానికి తన ప్రయత్నాలను తాను చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీకి చెందిన సెంటు భూమిని కూడా అమ్మనివ్వబోమని స్పష్టం చేశారు. ఇదివరకు అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని గుర్తు చేశారు. అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలించబోరని తాను ముందే చెప్పానని, అదే జరిగిందని అన్నారు.

 We will fight against sale of TTD Properties: BJP MP Sujana Chowdary

అమరావతి నుంచి రాజధాని తరలింపును అడ్డుకున్నట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానం భూములను కూడా అమ్మనివ్వకుండా తనవంతు ప్రయాత్నాలు చేస్తానని, అవి కూడా విజయవంతం అవుతాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు. టీటీడీ భూములను ఒక్క సెంటు కూడా అమ్మనివ్వమని, ఈ విషయంలో శ్రీవారి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, వారి భక్తి విశ్వాసాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

అధర్మంగా దేవుడి ఆస్తులు అమ్మితే ఆ అధర్మమే మింగేస్తుందని గతంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారని అన్నారు. తన మాటలను తానే విస్మరించారని ఎద్దేవా చేశారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తుపెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఆరునూరైనా దేవుడి భూములు కాపాడతామని, భక్తుల విశ్వాసాలకు ఎలాంటి విఘాతం కలగనివ్వబోమని సుజనా చౌదరి తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మకానికి పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి, పెడ ధోరణులకు నిదర్శనమని సుజనా చౌదరి విమర్శించారు.

Recommended Video

AP Assembly : TDP Leader Dhulipalla Narendra Chowdary Taken Into Custody @ Amaravati

English summary
Bharatiya Janata Party Rajya Sabha member Sujana Chowdary warns to Tirumala Tirupati Devasthanams officials and Andhra Pradesh Government headed by YS Jagan Mohan Reddy against proposed sale of TTD unviable proverties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X