వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసెట్ కౌన్సిలింగ్: సుప్రీంను ఆశ్రయిస్తామన్న హెచ్ఈసి

|
Google Oneindia TeluguNews

We will go to Supreme Court on EMCET counseling: HEC
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో సమావేశమయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టప్రకారం ప్రవేశాలను మండలి చేపడుతుందని ఆయన వెల్లడించారు. అడ్మిషన్లు, కౌన్సిలింగ్‌ను ఆపమని సుప్రీం కోర్టు పేర్కొనలేదని ఆయన చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టుకు మండలి విన్నవించనున్నట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

చట్టప్రకారం అడ్మిషన్లు జరిపే అధికారం ఉన్నత విద్యా మండలికి ఉందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం నాటి నోటిఫికేషన్ యథాతంగా కొనసాగిస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ త్వరగా ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వస్తున్నాయని చెప్పారు.

ఆగస్టు 7 నుంచి విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 4న సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. ఆలస్యానికి కారణాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.

English summary
Higher Education Council chairman Venugopl Reddy on Tuesday siad that they will go to Supreme Court on EMCET counseling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X