వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్లు తరిమికొడ్తాం: దేవినేని, జగన్ సభపై ఓయు విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
విజయవాడ: అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే తాము తరిమికొడతామని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య ముసుగులో, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతుందన్నారు. ఇరు ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తొత్తులుగా మారారని విమర్శించారు.

సీమాంధ్ర ప్రాంతానికి నికర జలాల కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. కృష్ణా డెల్టా రైతులు నికర జలాలు లేక ఇబ్బంది పడుతున్నారని, గోదావరి డెల్టా కింద పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్ జగన్ తన బెయిల్ కోసం కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

జగన్ సభపై ఓయు ఐకాస

ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి నాయకులు శనివారం మధ్యాహ్నం డిజిపి ప్రసాద రావును కలిశారు. ఈ నెల 26న హైదరాబాదులో జరగనున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరారు.

English summary
Telugudesam Party senior MLA Devineni Umamaheswara Rao on Saturday said they will oppose T bill in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X