ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనిగిరి కీచకపర్వం: నిందితులపై నమోదైన కేసులివే

డిగ్రీ విద్యార్థినిని సహచర విద్యార్థులే అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: డిగ్రీ విద్యార్థినిని సహచర విద్యార్థులే అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలిని పలువురు పరామర్శిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కనిగిరి ఘటన: కలెక్టర్‌ను నివేదిక కోరిన ప్రభుత్వంకనిగిరి ఘటన: కలెక్టర్‌ను నివేదిక కోరిన ప్రభుత్వం

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్మించి యువతిపై అత్యాచారయత్నానికి పూనుకొన్నారు. ఈ ఘటనలో విద్యార్థిని లవర్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.

ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్‌ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్‌ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?

బాధిత విద్యార్థినిని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బాధిత యువతికి ప్రభుత్వం అండగా ఉంటుందని నన్నపనేని హమీ ఇచ్చారు.

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు

నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు

కార్తీక్, పవన్ , సాయి అనే ముగ్గురు నిందితులు డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడడమే కాకుండా ఆ దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అత్యాచార యత్నం: సెక్షన్‌ 366, అసభ్యకరంగా తాకడం: 354 , దుస్తులు వూడదీసే యత్నం: 354బి ,అసభ్యకరంగా చిత్రీకరించడం: 67, 67ఏ , చరవాణి ద్వారా తీసి మరొకరికి ఇవ్వడం: ఐటీ యాక్ట్‌, వీటితో పాటు హత్యాయత్నం, చంపుతామని బెదిరింపులకు పాల్పడటం: 376 రెడ్‌ విత్‌, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం.ఎస్పీ

నిందితులను కఠినంగా శిక్షిస్తాం.ఎస్పీ

సాయి, కార్తీక్‌, పవన్‌ అనే ముగ్గురు యువకులపై ఇప్పటికే నాన్‌ బెయిల్‌ కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ సత్య ఏసుబాబు అన్నారు. బాధిత యువతితో పాటు మరో యువతితోనూ మాట్లాడి ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించినట్టు ఎస్‌పి చెప్పారు. నిందితులు ముగ్గురు యువకులను కఠినంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు ఎస్‌పి.

బాధిత యువతి కుటుంబానికి ఆర్థికసాయం

బాధిత యువతి కుటుంబానికి ఆర్థికసాయం

బాధిత యువతి కుటుంబాన్ని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు పరామర్శించారు. ముగ్గురు యువకులను కఠినంగా శిక్షించేలా చూస్తామని తెలిపారు. యువతికి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి మాట్లాడతానని, అన్ని విధాలుగా ఆమెను ఆదుకుంటామన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదన్నారు.

జిల్లాల్లో అవగాహన సదస్సులు

జిల్లాల్లో అవగాహన సదస్సులు

స్నేహం పేరుతో ఆడపిల్లను నమ్మించి అసభ్యకరంగా వీడియో తీసి జీవితంతో ఆడుకోవాలని చూడటం క్రూరమైన చర్య అని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. కనిగిరి ఘటనకు బాధ్యులైన సాయి, కార్తీక్‌, పవన్‌ అనే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో అవగాహన సదస్సులు పెట్టిస్తామన్నారు. ధైర్యంగా ఉండాలని బాధిత యువతికి భరోసా ఇచ్చారు.

English summary
Prakasham district Sp Yesubabu said that various cases registered on 3 accused. Ap Chief Minister Chandrababu Naidu asked to collector report on this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X