అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇసుకదందా చేస్తే కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్: చంద్రబాబు

ఇసుక దందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని చంద్రబాబు ప్రకటన.ఇసుక మాఫియా కోసం మార్గదర్శకాలను రూపొందించిన తర్వాత ప్రజల సంతృప్తి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: టెక్నాలజీ సహయంతో ప్రజల నుండి సమాచారాన్ని సేకరించి పాలన సాగిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. ఒకవేళ ఇసుక దందాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకొంటామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

మంగళవారం నాడు చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత మార్గదర్శకాల్లో చోటుచేసుకొన్న లోపాలతో కొందరు ఇసుక దందాను విచ్చలవిడిగా చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

we will punishes anyone if they will misuse sand: Chandrababu naidu

దీంతో ప్రభుత్వం ఇసుక ఉచితంగా సరఫరాకోసం మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని చంద్రబాబునాయుడు ప్రకటించారు.ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నందున దందాలు నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకొంటామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇసుకపై రవాణా చార్జీలు విపరీతంగా వసూలు చేయడం కూడ సరికాదన్నారు.

ఉచితంగా ఇసుకను ఇవ్వనున్న నేపథ్యంలో దుర్వినియోగం చేస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని బాబు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజల నుండి టెక్నాలజీ సహయంతో సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగా పాలన సాగిస్తున్నట్టు బాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 కాల్‌సెంటర్ల ద్వారా ప్రజల నుండి సమాచారాన్ని తెలుసుకొంటున్నట్టు చెప్పారు.

English summary
we will punish anyone if they will misuse sand Andhra pradesh Chief minister Chandrababu naidu. Chandrababu naidu spoke to media on Tuesday evening at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X