హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు సిద్ధమన్న జూడాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

We will work in rural areas says junior doctors
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం హైదరాబాద్‌‌లో జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా వైద్యులు కోసం ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించి.. తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలనే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

దాని కోసమే తాము ఆందోళన చేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఐతే తమను బలవంతంగా గ్రామాలకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వారు ఆరోపించారు. తమను వాడుకోని వదిలేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరస్తుందని విమర్శించారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు వైద్యులు ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఇలా ఐతే నాణ్యమైన వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు అందవని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యసేవలు అందించడం నేరమని జూడాలు గుర్తు చేశారు.

రేపు ఏదైనా జరిగితే వైద్యులకే నష్టమని వాపోయారు. ఇలాంటి చర్యల వల్ల వైద్యుల్లో అభద్రత నెలకొంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాలనేది తమ వాదన అని వారు పేర్కొన్నారు.

English summary
Telnagana junior doctors ready to work in rural areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X