వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న, శిల్పా గురించి తెలియకే జగన్ టిక్కెట్టు''

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డిని గెలిపించి.... తన తండ్రిని మళ్ళీ నంద్యాల ప్రజలు బతికించుకొన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.నంద్యాలలో విజయం ద్వారా తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు అఖిలప్రియ.

నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 27వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఉపఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత మంత్రి అఖిలప్రియ తెలుగు మీడియా న్యూస్ ఛానళ్ళతో మాట్లాడారు.

నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది. ముఖ్యంగా భూమా అభిమానుల్లో ఈ ఉత్సాహం మరింత రెట్టింపు అయింది.ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని కూడ లెక్క చేయకుండా ప్రజలు తమ వైపు నిలబడినందుకు మంత్రి అఖిలప్రియ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు తన తండ్రి నాగిరెడ్డి ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. ఈ హమీల అమలు కోసం కృషి చేస్తానని వివరించారు.

ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న

ఆళ్ళగడ్డ అమ్మ, నంద్యాల నాన్న


ఆళ్ళగడ్డ, నంద్యాల ప్రజలు తమకు తల్లిదండ్రులనే విషయాన్ని మంత్రి అఖిలప్రియ మరోసారి ప్రకటించారు. తల్లిదండ్రులను కోల్పోయిన తమకు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు తల్లిదండ్రులుగా ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు.తన తల్లి మరణించిన తర్వాత ఆళ్ళగడ్డలో తనను గెలిపించి నా తల్లిని బతికించారని ఆమె చెప్పారు.నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడు భూమా బ్రహ్మనందరెడ్డిని గెలిపించి నాన్న భూమా నాగిరెడ్డిని మళ్ళీ బతికించుకొన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.ఆళ్ళగడ్డ నియోజకవర్గం అమ్మగా, నంద్యాల నియోజకవర్గం నాన్న అంటూ ఆమె చెప్పారు.

Recommended Video

Nandyal ByPolls Results Live Update: TDP Leading by a Margin of 2832 votes in 2nd round
అమ్మ, నాన్నలను మాదిరిగానే

అమ్మ, నాన్నలను మాదిరిగానే

నా కన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని భావించానో... ఆ తరహలోనే నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలను చూసుకొంటానని మంత్రి అఖిలప్రియ ప్రకటించారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నంద్యాల ప్రజలకు రుణపడి ఉంటామని మంత్రి అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా హామీలను నెరవేరుస్తామని చెప్పారు. కుట్ర రాజకీయాలకు తావులేదని ప్రజలు నిరూపించారని మంత్రి అన్నారు.భారీ మెజారిటీతో గెలిపించిన నంద్యాల ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

శిల్పా మోహన్‌రెడ్డి రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా నష్టం లేదు

శిల్పా మోహన్‌రెడ్డి రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా నష్టం లేదు

ఉపఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ... శిల్పా మోహన్‌రెడ్డి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పెద్దగా తమకు నష్టం లేదని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.భూమా కుటుంబంపై నమ్మకంతో ప్రజలంతా వైసీపీకి, శిల్పా సోదరులకు బుద్ది చెప్పాలనే లక్ష్యంతో ఓటు చేశారని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు.

 శిల్పా గురించి తెలియక జగన్ టిక్కెట్టు ఇచ్చారు.

శిల్పా గురించి తెలియక జగన్ టిక్కెట్టు ఇచ్చారు.

శిల్పా బ్రదర్స్ ఎన్నో అక్రమాలు చేశారని, ఆ విషయం తెలియక జగన్ శిల్పాకు సీటు ఇచ్చారని, కానీ ఇక్కడకు వచ్చినతర్వాత వాళ్లు కూడా తలకొట్టుకుని ఎందుకు టిక్కెట్ ఇచ్చామా? అన్న పరిస్థితి వచ్చిందని మంత్రి ఎద్దేవా చేశారు.నంద్యాలలో శిల్పా బ్రదర్స్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని, జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు చూశారని, వ్యక్తిగతంగా తనపై కూడా విమర్శలు చేశారని, శిల్పా బ్రదర్స్ చనిపోయిన తన తల్లిదండ్రులపై కూడా విమర్శలు చేశారని..ఇలాంటివన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని, వైసీపీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మంచి మెజారిటీతో బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని అఖిలప్రియ పేక్కొన్నారు.

English summary
we will work for Allagadda, Nandyal assembly segments development said Ap tourism minister Bhuma Akhilapriya. After Nandyal by poll result She spoke to media on Monday at Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X