• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లగడపాటిని కూడా వదలం: తెలంగాణ డిప్యూటీ సీఎం

By Nageswara Rao
|

హైదరాబాద్: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వక్స్ భూముల ఆక్రమణలపై దృష్టిపెట్టాం. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణను ప్రారంభించారు. కె. చంద్రశేఖరరావు మైనార్టీ సంక్షేమ శాఖను ఆయన వద్దనే ఉంచుకున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరలో వక్స్ భూముల ఆక్రమణలతో పాటు... భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట మండలం మహబూబ్ పేటలోని సయ్యద్ అక్రముల్లా, సాదాద్రి ఉర్సు ఉజాలేతాద్రి, దర్గా ఉర్స్ ఏ షరీఫ్లో పాల్గోని మంత్రి చాదర్ సమర్పించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వక్ప్ భూములను రక్షించేందుకు వక్ప్ బోర్డుకు జ్యుడిషియరీ పవర్స్ ఇచ్చామని, ఇది చారిత్రాత్మక నిర్మయమన్నారు. వక్ప్ భూములను ఆక్రమించుకున్న ఆంధ్రా, రాయలసీమ నేతలపై లోతైన విచారణను కొనసాగిస్తామని, బాధ్యుతులు ఎంతటివారైనా వారిని వదలమన్నారు. 1930 తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు భూ సర్వే జరగలేదన్నారు. ఇటీవలే సమగ్ర సర్వే ముగియడంతో ఇక భూ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను సుమారు రూ. 1000 కోట్లు అవసరమన్నారు. గణేశ్ నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్న దర్గాలు మత సామరస్యానికి ప్రతీకలన్నారు.

సమగ్ర భూ సర్వే

We won't leave lagadapati rajagopal : Deputy cm mahmood ali

రాష్ట్రంలో 1932లో నిజాలం కాలంలో భూ సర్వే జరిగింది. అది కేవలం తాత్కాలిక సర్వే. ఉమ్మడి రాష్ట్రం కొనసాగిన 60 ఏళ్ల కాలంలో భూమి సర్వే చేయలేదు. దీంతో అనేక భూ వివాదాలు దశాబ్దాల తరతరబడి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఇది మాత్రమే కాదు లక్షల ఎకరాల సర్కారు భూమికి లెక్క లేకుండా పోయింది. గతంలో ఉన్న రికార్డులే అన్నింటికి ప్రామాణకం కావడంతో ప్రభుత్వం చాలా తలనొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భూ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

సమగ్ర భూ సర్వే మరో రెండు నెలల్లో మొదలు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే నిర్వహించేందుకు సుమారు రూ. 1000 కోట్లకు పైగా ఖర్చవుతుందని సర్వే ల్యాండ్ సెటిల్ మెంట్స్ అండ్ రికార్డుల శాఖ అంచనా వేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూ వనరుల శాఖకు రెండు నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెవెన్యూ మంత్రుల సదస్సులో కేంద్రం భూ సర్వే చేపట్టేందుకు 50 శాతం నిధులను అందజేస్తామని ప్రకటించింది.

English summary
Telangana state deputy cm mahmood ali says won't leave lagadapati rajagopal regarding Wakf lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X