నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోదరుడిని కూడ కాదని అలా, ఆనం బ్రదర్స్ బాబుకు షాకిస్తారా

టిడిపిలో ఆనం బ్రదర్స్‌ సంతృప్తిగా లేరనే ప్రచారం సాగుతోంది. ఆనం బ్రదర్స్‌ను పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: టిడిపిలో ఆనం బ్రదర్స్‌ సంతృప్తిగా లేరనే ప్రచారం సాగుతోంది. ఆనం బ్రదర్స్‌ను పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా టిడిపిలోనే కొనసాగుతామని ఆనం బ్రదర్స్ తమ అనుచరులకు తేల్చి చెప్పేశారని సమాచారం. దీంతో వారు టిడిపిక్ గుడ్‌బై చెబుతారనే ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు కొందరు టిడిపి నేతలు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునే ఆనం బ్రదర్స్ పోటీచేశారు. అయితే ఏపీ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కొంత కాలం క్రితం ఆనం బ్రదర్స్ టిడిపిలో చేరారు.

అయితే టిడిపిలో చేరిన తర్వాత మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూర్ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆనం బ్రదర్స్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్టును ఇస్తామని టిడిపి అధినేత హమీ ఇచ్చారనే ప్రచారం ఉంది. అయితే ఈ హమీని అమలు చేయలేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆనం బ్రదర్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఆనం అనుచరుల్లో కూడ అసంతృప్తి లేకపోలేదు. దీంతో పార్టీ మారాలనే ఒత్తిడి కూడ ఆనం సోదరుల్లో నెలకొంది. అయితే పార్టీ మారే విషయంలో అనుచరులకు వారు స్పష్టత ఇచ్చారు. టిడిపిలోనే కొనసాగనున్నట్టు తేల్చి చెప్పారని సమాచారం.

టిడిపిలోనే కొనసాగుతాం

టిడిపిలోనే కొనసాగుతాం

ఇటీవల కాలంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆనం బ్రదర్స్ కూడ టిడిపిని వీడనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఆనం బ్రదర్స్ ఖండించారు. టీడీపి తమకు కొత్తేం కాదనీ, మాటిమాటీకి పార్టీలు మారాల్సిన అవసరం తమకు లేదని వారు తమ అనుచరులకు స్పష్టం చేశారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా ఇదే రీతిలో టిడిపిలో కొనసాగుతామని కూడ తమ అనుచరులకు ఆనం బ్రదర్స్ స్పష్టం చేశారని సమాచారం.

Recommended Video

TDP Anam Vivekananda Reddy Fires On YS Jagan - Oneindia Telugu
సోదరుడిని కూడ కాదని టిడిపి గెలుపు కోసం

సోదరుడిని కూడ కాదని టిడిపి గెలుపు కోసం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని వైసీపీ రంగంలోకి దింపింది. టిడిపి అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన వాకాటి నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. అయితే టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి గెలుపు కోసం సోదరుడిని కూడ కాదని ఆనం బ్రదర్స్ పనిచేశారు. అయితే టిడిపిలో చేరే సమయంలో తమకు ఇచ్చిన హమీలను ఆ పార్టీ మాత్రం నెరవేర్చలేదనే అభిప్రాయంతో ఆనం బద్రర్స్ ఉన్నారు.

ఆనం అనుచరులు అలా

ఆనం అనుచరులు అలా

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాలో పార్టీలో ఆనం బ్రదర్స్‌దే పెత్తనం. వారు చెప్పినట్టుగానే పార్టీలో నడిచేది. అయితే టిడిపిలో చేరిన తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు ఆనం బ్రదర్స్ ప్రయత్నిస్తోన్నా స్థానికంగా ఉన్న నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఆనం అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలని అనుచరులు ఆనం బ్రదర్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

కన్నబాబు అసంతృప్తి

కన్నబాబు అసంతృప్తి

ఆత్మకూర్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా కన్నబాబు పోటీచేశారు. అయితే ఆనం బ్రదర్స్ పార్టీలో చేరిన తర్వాత రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుండి కన్నబాబు పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తన పరిస్థితి ఏంటని టిడిపి నాయకత్వాన్ని కన్నబాబు ప్రశ్నిస్తున్నారని సమాచారం.

పదవులే ఇలా వస్తాయి

పదవులే ఇలా వస్తాయి

తమ పని తాము చేసుకొంటూపోతే పదవులే వెతుక్కొంటూ వస్తాయని ఆనం బ్రదర్స్ నమ్ముతున్నారు. కాంగ్రెస్ నుండి ఆనం బ్రదర్స్ టిడిపిలో చేరిన తర్వాత కూడ ఆనం వర్గీయులు తిరిగి టిడిపిలో చేరుతున్నారు. అయితే పార్టీ మాత్రం ఆనం బ్రదర్స్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయాలు ఆనం వర్గీయుల్లో ఉంది. అయితే అన్నింటికి కాలమే సమాధానం చెబుతోందనే రీతిలో ఆనం బ్రదర్స్ ఉన్నారు.

English summary
we won't leave Tdp said Anam brothers. Anam Ramanarayana reddy , Anam vivekananda reddy recently joined in Tdp,Tdp chief Chandrababu naidu not implement his promises to Anam brothers.so There is a spreading a rumour Anam brothers will leave Tdp, They were condemned this rumour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X