imd: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక

ఏపీలో రోజురోజుకు వాతావరణం వేడెక్కుతోంది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కి ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. తాజాగా సాధారణ వాతావరణం కూడా ఉగ్రరూపం దాలుస్తోంది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతులు పెరుగుతున్నాయి. రానున్న వేసవి రోజులన్నీ తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. సముద్రతీరం ప్రాంతం కావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో కూడా ఉష్ణతాపం అధికంగానే ఉండనుంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయంటున్నారు.

జూన్ నెలాఖరు వరకు వేసవి తీవ్రత కొనసాగనుంది. 2019లో ఉన్న ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తున్నారు. వడగాడ్పులకు కూడా అవకాశం ఉంటుందన్నారు. కోస్తాలో మరింత వేడి ఉండనుంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు కానున్నాయి. పగటివేళ కాకపోయినా రాత్రివేళ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం చల్లబడుతుందని, ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే వారి ఆలోచనలకు భిన్నంగా రాత్రివేళ కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు. జూన్ మొదటివారం వరకు ఎల్ నినో పరిస్థితులు కొనసాగనున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించేవరకు రాష్ట్రంలో ఎల్ నినో ఉంటుందన్నారు.

weather warning for andhra pradesh people

మూడురోజుల క్రితం అనంతపురంలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదైంది. నంద్యాల, కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయిన వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+