వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుదవారం ప్రజావేదిక కూల్చేస్తాం..! సంచలన ప్రకటన చేసిన జగన్..!! నెక్స్ట్ టార్గెట్ బాబు ఇళ్లేనా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు : జగన్ || Jagan Made Sensational Comments || Oneindia

అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజధానిలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వివాదంగా మారిన ప్రజావేదికపై కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్ అని సీఎం అధికారులతో చెప్పారు. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు అని సీఎం జగన్ ప్రజావేదికపై తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. ఎస్పీల సమావేశం తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని సీఎం తెలిపారు. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణం కాదని కలెక్టర్లతో జగన్ వ్యాఖ్యానించారు.

 కలెక్టర్లల కాన్ఫరెన్స్ లో జగన్ సంచలన నిర్ణయం..! ఇక ప్రజావేదిక కనపడదు..!!

కలెక్టర్లల కాన్ఫరెన్స్ లో జగన్ సంచలన నిర్ణయం..! ఇక ప్రజావేదిక కనపడదు..!!

50 ఇళ్లకు ప్రతినిధిగా పనిచేసే గ్రామ వాలంటీర్ తప్పు చేస్తే విచారణ చేసి తెలుసుకుంటామని, తప్పు చేసినట్లు తేలితే తక్షణమే విధుల్లో నుంచి తొలగిస్తామని.. ఎవరు చెప్పినా తమ నిర్ణయంలో మార్పు ఉండదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లుగా పనిచేసే వ్యక్తులు అవినీతికి పాల్పడకూడదన్న ఉద్దేశంతోనే నెలకు 5000 రూపాయల వేతనం అందించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు.

 ప్రజా వేదికలో జగన్ మొదటి సమీక్ష..! ఇదే ఆఖరిది కూడా..!!

ప్రజా వేదికలో జగన్ మొదటి సమీక్ష..! ఇదే ఆఖరిది కూడా..!!

ఉండవల్లి ప్రజావేదికలో ఇవాళ, రేపు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా జరగబోతోంది. ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమైంది. కలెక్టర్లు, ఉన్నతాధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలని జగన్ సూచించారు.

 అక్రమాలను ఉపేక్షించేది లేదు..! కలెక్టర్టు చిత్తశుద్దితో పని చేయాల్సిందే..!!

అక్రమాలను ఉపేక్షించేది లేదు..! కలెక్టర్టు చిత్తశుద్దితో పని చేయాల్సిందే..!!

ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అక్రమాలకు గానీ, దోపిడీలకు గానీ పాల్పడితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉండదని జగన్ హెచ్చరించారు. ఎంతటి పెద్దవాడైనా గానీ, ఏ స్థాయిలో అయినా ఉండనీ ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం స్పష్టం చేశారు.

 గ్రామ వాలంటీర్లకు జగన్ ముందస్తు హెచ్చరిక.. ! అవినీతికి ఆస్కారం ఉండొద్దన్న సీఎం..!!

గ్రామ వాలంటీర్లకు జగన్ ముందస్తు హెచ్చరిక.. ! అవినీతికి ఆస్కారం ఉండొద్దన్న సీఎం..!!

నవరత్నాలను ప్రజలకు చేర్చే విధులు నిర్వర్తించనున్న గ్రామ వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు హెచ్చరిక పంపారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడితే తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ చెప్పారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడితే సీఎం కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేసే విధంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జగన్ గుర్తుచేశారు.

English summary
CM Jagan made a sensational remarks at a collectors' conference on a praja vedika that has become a political dispute between YCP and TDP in AP capital. CM told the officials that this was the last meeting in the building. CM Jagan made clear his stance on the public platform that the demolition of illegal structures started with a Praja Vedika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X