వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్వామీజీకి ఆహ్వానం ? అందుకేనా జగన్ విశాఖ పర్యటన

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ విశాఖ పర్యటన... శారదా పీఠాధిపతికి ఆహ్వానం..? || Oneindia Telugu

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి వైసీపీ అధినేత ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించనున్న నేపధ్యంలో ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అసలు జగన్ స్వామీజీని కలవటానికి ఎందుకు వెళ్తున్నారు . కేవలం ఆశీర్వచనం కోసమా ? లేదా ఇంకేదైనా కారణం ఉందా ? అని అందరూ ఆలోచనలో పడ్డారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జగన్ విశాఖ శారదా పీఠానికి వెళ్తున్న ఏపీ సీఎం జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామితో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ శ్రీ శారదా పీఠాధిపతి సలహాలు సూచనలు తీసుకుంటారని సమాచారం. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వరూపానందేంద్ర స్వామిని జగన్ ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తుంది .

Welcome to Swamiji for swearing of ministers? That is why the Jagans tour for Vishakha

అలాగే, ప్రమాణ స్వీకారం, సచివాలయంలోని తన చాంబర్‌లోకి ప్రవేశించేందుకు అనువైన ముహూర్తం వంటి వాటిపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరోవైపు, కేబినెట్ పదవి ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు సైతం శారదా పీఠాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు. దీంతో నేతలతో పీఠం సందడిగా మారింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళుతున్న జగన్ మంగళవారంనాడు ఉదయం 11 గంటలకు అమరావతి నుండి విశాఖపట్టణానికి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా శారదా పీఠానికి చేరుకొంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా శారద పీఠానికి చేరుకొని ఆయన ఆశీస్సులు తీసుకొంటారు.

సుమారు రెండు గంటల పాటు విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామితో భేటీ అవుతారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భద్రతాపరమైన ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తునన్నారు. జగన్ పాదయాత్రం సమయం నుంచి మొన్నటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ముహూర్తాన్ని స్వరూపానంద నిర్ణయించారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వామిని కలవబోతున్నారు.

English summary
The AP Chief Minister YS Jagan Mohan Reddy to visit Visakhapatnam on Tuesday (4 June). On the occasion, YS Jagan will be meeting with Vishaka Sri Sarada Peetham chief Swami Swaroopananda and will be taking his blessings. Jagan is likely to be invited to attend the ministerial swearing-in ceremony on june 8. Swamy advices and suggestions will also be taken on the swearing-in ceremony, such as the Muhurtham, to enter the Chamber of the Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X