వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతమనేని ప్రభాకర్ వీడియో, వైసీపీ నేత అరెస్ట్: అసలేం జరిగిందంటే.. జిల్లా ఎస్పీ

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో ఇటీవల కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఎస్సీ సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించారంటూ ఓ వీడియో వెలుగు చూసింది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

 వీడియో విషయంలో ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ

వీడియో విషయంలో ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ... చింతమనేని ప్రభాకర్ వీడియోను కావాలని ఎడిట్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. నిందితుడు పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన కత్తుల రవిగా గుర్తించామని చెప్పారు. తొలుత రవికుమార్ ఫేస్‌బుక్‌లో వీడియో అప్ లోడ్ చేసి, ఆ తర్వాత యూట్యూబ్‌లో పెట్టారని చెప్పారు. రవి వైసీపీ కార్యకర్త అన్నారు.

ముప్పై సెకన్ల వ్యాఖ్యలతో ప్రచారం

ముప్పై సెకన్ల వ్యాఖ్యలతో ప్రచారం

చింతమనేని ప్రభాకర్ స్పీచ్‌లో ముప్పై సెకన్ల వ్యాఖ్యల ప్రచారంతో ఆందోళనలు చెలరేగాయని ఎస్పీ తెలిపారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మనోభావాలు దెబ్బతినేలా వీడియో ఉండటం వల్ల రవి పైన కేసు నమోదు చేశామని అన్నారు. దళితులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని ఫేస్‌బుక్ పోస్టింగులు పెట్టి తనను అప్రతిష్టపాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చింతమనేని బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకున్నారు.

వైసీపీ నేత అరెస్ట్‌పై ఆగ్రహం

వైసీపీ నేత అరెస్ట్‌పై ఆగ్రహం

మరోవైపు, దళితుల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చింతమనేని మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి, సోషల్‌ మీడియాలో షేర్ చేశారని కత్తుల రవిని పెదపాడు పోలీసులు అరెస్టు చేయడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. కత్తుల రవి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత. రవిని వెంటనే విడిచిపెట్టాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని ఆయా సంఘాలు కూడా హెచ్చరించాయి.

English summary
West Godavari SP talks about Chintamaneni Prabhakar videos and Police arrested YSRCP leader in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X