బ్రాహ్మిణి సరే భారతి మాట, సాక్షితో కాలుష్యమే: రేవంత్

బ్రాహ్మిణి ధరించిన ఆభరణాల విలువ కోట్లలో ఉంటుందని సాక్షి దిన పత్రిక ఇచ్చింది. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతి ఏడాది స్వచ్ఛందంగా తన ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారని, దీనిని జగన్ పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. జైలులో ఉన్న జగన్‌ను భారతి పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఆమె చెవులకు ఉన్న వజ్రాభరణాలు ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తావో చెప్పాలన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలకు, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పోలికే లేదన్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణలు అగ్రశ్రేణి నటులను, కష్టపడి సంపద ఆర్జించుకున్న కుటుంబాలు అన్నారు. బాబు తండ్రి, తాత కూడా కష్టపడి పైకొచ్చిన వారే అన్నారు. వైయస్ కుటుంబం చరిత్ర చూస్తే ఒకరు రొడీ, మరొకరుదొంగ, ఇంకొకరు రౌడీషీటర్ అని మండిపడ్డారు.
బలపనూరులో బతకలేక మతం మార్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాను కొన్నప్పటి ఆస్తుల విలువలను, చేసిన పెట్టుబడులను చెప్పారన్నారు. వాటిని ప్రస్తుత విలువతో లెక్కించడం సబబు కాదన్నారు. జగన్ కుటుంబ సభ్యులకు చిత్తశుద్ధి ఉంటే వారి ఆస్తుల వివరాలు, వారికున్న కంపెనీలు, పెట్టుబడుల గురించి చెప్పాలన్నారు. సాక్షి రాసేవన్నీ చెత్తరాతలనీ, ఆ టీవి ఛానెల్ వల్ల శబ్ద కాలుష్యం తప్పిస్తే ఇంకేమీ ఉండదని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications