అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూటర్న్ బాబు.. చెన్నై, ముంబై, కొచ్చి రాజధానులే కదా? విశాఖ సైక్లోన్ ఏరియా కామెంట్లపై బొత్స

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతారని గుర్తుచేశారు. అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేపడితే జీఎన్ రావు కమిటీ, బీసీజే కమిటీలు ఇచ్చిన రిపోర్టులను బోగీ మంటల్లో పడేసి కాల్చివేయాలని కోరారన్నారు. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు. ఈ రోజు పత్రికలు పతాక శీర్షికలో విశాఖకు రాజధాని వద్దు ముప్పు ఉందని ఆ కమిటీ చెప్పిన అంశాన్ని రాయడంతో.. తన అభిప్రాయం మార్చుకున్నట్టు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.

రాజకీయ లబ్ది కోసం

రాజకీయ లబ్ది కోసం


రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమని బొత్స సత్యనారాయణ విమర్శించారు. పూటకో మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. ఒక మాటకు కట్టుబడి లేకుంటే విశ్వసనీయత ఉండబోదన్నారు. అందుకే చంద్రబాబు నాయుడిని యూ టర్న్ బాబు అంటారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వైఖరి మారుతూనే ఉంటుందని చెప్పారు.

తప్పుడు ప్రచారం..

తప్పుడు ప్రచారం..

విశాఖపట్టణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పారు. ప్రాంతాల వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అందుకే మూడు రాజధానుల ఏర్పాటు కోసం మొగ్గుచూపమని చెప్పారు. అందుకోసమే మూడు కమిటీలను కూడా నియమించామని చెప్పారు.

సైక్లోన్ ఏరియా

సైక్లోన్ ఏరియా

విశాఖపట్టణం సైక్లోన్ ఏరియా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మరి ముంబై, చెన్నై, కొచ్చి సంగతేంటి అని అడిగారు. అవి రాజధానులుగా విరజిల్లడం లేదా..? అభివృద్ధి చెందడం లేదా అని అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నమే ఇది అని విమర్శించారు.

పేదల పక్షపాతి..

పేదల పక్షపాతి..

విశాఖలో లక్షా 75 వేల మంది బలహీనవర్గాలకు ఇళ్లు కట్టిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని స్పష్టంచేశారు. పెద్దల సౌకర్యాల కోసం పాటుపడదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితికి చంద్రబాబు నాయుడే కారణమని బొత్స ఆరోపించారు. ఆయన విధానాల వల్లే ఏపీ ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

English summary
what about chennai, mumbai.. minister botsa satya narayana ask to tdp chief chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X