వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌పై ఏపీ 'ప్రత్యేక' ఆసక్తి: అందుకే బాబు ఆశ, ఆ మనస్తత్వం ఉంటే.. యనమల చురక

|
Google Oneindia TeluguNews

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు, ఈ దపా అరుణ్ జైట్లీ ప్రవేశ పెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఏళ్లుగా పెండింగులో ఉన్న పలు అంశాలను ఈ బడ్జెట్‌లో పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది ఎన్డీయే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. కాబట్టి ఇది చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

బడ్జెట్: వ్యక్తిగత పన్ను రాయితీ నుంచి.. ఏఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటేబడ్జెట్: వ్యక్తిగత పన్ను రాయితీ నుంచి.. ఏఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే

సానుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం

సానుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులకు సంబంధించి అందరిలోను ఉత్కంఠ నెలకొంది. గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విభజన సమస్యల పరిష్కారం సహా నిధుల కేటాయింపుపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఇప్పటికే సమస్యల జాబితా, పెండింగ్‌లో ఉన్న నిధుల నివేదికను కేంద్రానికి పంపింది.

Recommended Video

Budget 2018 Expectations : ఫిబ్రవరి 1న బడ్జెట్: ఆకాంక్షలు నెరవేరేనా?
అందుకే ఏపీ ప్రభుత్వం ఆశలు

అందుకే ఏపీ ప్రభుత్వం ఆశలు

అయితే మరిన్ని వివరాలు కావాలని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కోరినందున బడ్జెట్‌ అశాజనకంగా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కేంద్రం సిద్ధం చేస్తున్న బడ్జెట్‌ నిధుల విడుదలకు సంబంధించి ఏపీకి ఇది చివరి అవకాశం. విభజన జరిగి నాలుగేళ్లు దాటినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంత మాత్రమేనని టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే

అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే

అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లుగానే ఏపీకి నిధులు వస్తున్నాయి. నవ్యాంధ్రను ప్రత్యేకంగా పరిగణిస్తామని కేంద్రం హామీలు ఇచ్చింది. కానీ అలా ఏమీ కనిపించడం లేదని ఏపీ రాజకీయ పార్టీలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో కేంద్రం నుంచి సాధ్యమైన్ని నిధులు రాబట్టేందుకు రాష్ట్రం అన్ని ప్రయత్నాలు చేసింది.

కేంద్రం ముందు డిమాండ్లు

కేంద్రం ముందు డిమాండ్లు

రాజధాని నిర్మాణం, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు సంబంధించి డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సిన రూ.1000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని ఇప్పటికే అడిగింది.

ఏపీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది, ఏపీని ప్రత్యేకంగా చూడాలి

ఏపీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది, ఏపీని ప్రత్యేకంగా చూడాలి

బడ్జెట్ విషయమై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం మీడియాతో మాట్లాడారు. రేపటి బడ్జెట్ పైన ఏపీ ఆసక్తిగా ఎదురు చూస్తోందని చెప్పారు. విభజన సమస్యలు, పెండింగ్ నిధుల కేటాయింపు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక కష్టాల నుంచి ఏపీ గట్టెక్కాలంటే కేంద్రం ఆదుకోవాలన్నారు. నిధుల కేటాయింపులో ఏపీని ప్రత్యేకంగా చూడాలన్నారు. రెవెన్యూ లోటు కింద రూ.138 కోట్లే వస్తాయని కేంద్రం అంటోందని, రెవెన్యూ లోటు ఇంకా రూ.3వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.

ఇవ్వాలనే మనస్తత్వం ఉంటే

ఇవ్వాలనే మనస్తత్వం ఉంటే

పెండింగ్ నిధులు ఈ నెలాఖరులోగా వస్తాయని భావిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జరుపుతారని భావిస్తున్నట్లు చెప్పారు. ఇవ్వాలనే మనస్తత్వం ఉంటే కేంద్రం పాజిటివ్‌గా ఆలోచిస్తుందని యనమల అన్నారు. కేంద్రం సానుకూలంగా ఆలోచించి ఏపీ సమస్యలు పరిష్కరించాలన్నారు.

English summary
Telangana and Andhra Pradesh are eagerly awaiting the Union Budget to be presented by the Union Finance Minister Arun Jaitley in Parliament on February 1. Both state governments have high hopes of at least some of their long-pending issues being addressed by the Central government in this annual exercise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X