వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, జనసేన పొత్తుపై జనసేన నేత, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

బీజేపీతో జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకుంది. అయితే ఈ పొత్తులపై ఎవరికి వారు తమదైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ఆయా పార్టీల ఇష్టం అని బీజేపీ , జనసేనల పొత్తు వారి అభీష్టం అని పేర్కొంటే , వామపక్ష నేతలు మాత్రం చేగువీరా కాస్తా చెంగువీరా అయ్యారని విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలను పక్కన పెట్టి పవర్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పాలి ..బీజేపీ,జనసేన పొత్తు వారి ఇష్టం : చంద్రబాబురాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పాలి ..బీజేపీ,జనసేన పొత్తు వారి ఇష్టం : చంద్రబాబు

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధానిగా అమరావతిని సాధించుకోవటం కోసం రాజధాని అమరావతికి కట్టుబడిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని భవిష్యత్ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని, కలిసే పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇక తాజాగా బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవటంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీ నిర్ణయాలపై, పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై నోరు మెదపని మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తాజాగా కుదుర్చుకున్న పొత్తుపై మాట్లాడారు.

What does Janasena leader and former JD Lakshmi Narayana say on BJP and Janasena alliance

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జనసేన పార్టీకి శుభసూచకంగా అభివర్ణించారు. ఈ విషయమై తమ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని వైసీపీ సర్కార్ కు సూచించారు. మండలి రద్దుపై ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, నియమనిబంధనలను అనుసరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు లక్ష్మీ నారాయణ.రాజధాని మార్పు అంశంపై న్యాయస్థానం తన తీర్పు ద్వారా తేలుస్తుందని అన్నారు

English summary
Former CBI JD Lakshminarayana expressed his delight at the alliance of BJP and Janasena parties. Former JD Lakshmi Narayana has spoken on the latest alliance on party decisions and party affairs. The alliance with the BJP was a good thing for the Janasena party. He said he was upholding the decision taken by party chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X