వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెలెక్ట్ కమిటీ వివాదంలో గవర్నర్ ఏం చేస్తారు? ఉద్యోగ సంఘాల ఎంట్రీతో ఏం జరగనుంది ?

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసన మండలి సెలెక్ట్ కమిటీ వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో చైర్మన్ ,సెక్రటరీల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చెయ్యమంటే సెక్రటరీ రెండు సార్లు చైర్మన్ ఆదేశాన్ని ధిక్కరించటంపై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన గవర్నర్ హరి చందన్ కు ఫిర్యాదు చేశారు . శాసనమండలి ఇచ్చిన రూలింగ్ ను అమలు చెయ్యకపోవడంపై షరీఫ్ గవర్నర్ ను కలిసి సెక్రటరీని తొలగించాలని ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఏపీలో పెద్ద చర్చ జరుగుతుంది.

మండలి కార్యదర్శిపై చైర్మన్ సీరియస్ ..సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు హుకుం..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ !మండలి కార్యదర్శిపై చైర్మన్ సీరియస్ ..సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు హుకుం..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ !

గవర్నర్ హరి చందన్ కు మండలి చైర్మన్ ఫిర్యాదు

గవర్నర్ హరి చందన్ కు మండలి చైర్మన్ ఫిర్యాదు

ఏపీ శాసనమండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం కోసం జరిగిన తతంగం , సెలెక్ట్ కమిటీని వెయ్యటం , ఆ తర్వాత ఏపీ శాసనసభలో మండలి రద్దు తీర్మానం తదనంతర పరిణామాలు మండలి చైర్మన్ షరీఫ్ గవర్నర్ బిస్వభూషణ్ హరి చందన్ కు తెలియజేశారు.సెక్రటరీ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను మండలి చైర్మన్ కోరారు. అయితే మండలిలో అధికారులపై చైర్మన్ గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యటం చిన్న విషయం కాదనే వాదన వినిపిస్తోంది.

గవర్నర్ కోర్టులో మండలి వివాదం

గవర్నర్ కోర్టులో మండలి వివాదం

చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చెయ్యకపోవటం అధికారులు సభను ధిక్కరించినట్లుగా చూడాలని చెపుతున్నారు. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశం . గవర్నర్ కు చైర్మన్ ఫిర్యాదు చేశారు కాబట్టి సెక్రటరీపై చర్యలు తీసుకుంటారా ? అతనిని వివరణ కోరతారా ? అన్నది ఆసక్తికర అంశం . ఒకవేళ అదే జరిగిది అది పెద్ద ఘటనగానే చూడాల్సి ఉంటుంది.

గవర్నర్ వివరణ కోరతారా ? సెక్రటరీ సమాధానం ఏంటి ?

గవర్నర్ వివరణ కోరతారా ? సెక్రటరీ సమాధానం ఏంటి ?

ఒక వేళ ఈ ఫిర్యాదు విషయంలో గవర్నర్ వివరణ కోరితేమండలి సెక్రటరీ ఏం చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. సెక్రటరీని ఆ పోస్టు నుంచి తప్పించాలని కౌన్సిల్ చైర్మన్ డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో అదే జరిగితే అధికార పార్టీ వైసీపీ కూడా డిఫెన్స్ లో పడే ప్రమాదం ఉంది. మరి గవర్నర్ ఈ వ్యవహారంలో ఏం చేస్తారో తెలియాల్సి ఉంది. ఇక మండలి చైర్మన్ ఫిర్యాదు మేరకు కార్యదర్శిపై చర్యలు తీసుకుంటే ఉద్యోగ సంఘాలు వూరుకునేలా లేవు .

కార్యదర్శికి బాసటగా రంగంలోకి ఉద్యోగ సంఘాలు

కార్యదర్శికి బాసటగా రంగంలోకి ఉద్యోగ సంఘాలు

అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులపై చర్యలు తీసుకోవాలంటూ మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ హరి చందన్ ను కలవడాన్ని అసెంబ్లీ, సెక్రటేరీయేట్ ఉద్యోగ సంఘాలు సీరియస్‌గా తీసుకున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ నీలం సాహ్నీని కలిశారు. అసెంబ్లీ కార్యదర్శికి బాసటగా నిలుస్తూ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రూల్స్‌కు అనుగుణంగా పని చేసే అధికారులకు భద్రత కల్పించాలని కోరారు. ఇక దీంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

Recommended Video

Kodali Nani Says "AP Yellow Virus Is More D@nger Than Corona" ! | Oneindia Telugu
రోజుకో మలుపు తిరుగుతున్న సెలెక్ట్ కమిటీ వివాదం

రోజుకో మలుపు తిరుగుతున్న సెలెక్ట్ కమిటీ వివాదం

ఇప్పటి వరకు సెలెక్ట్ కమిటీ వ్యవహరం మండలి కోర్టు నుండి గవర్నర్ కోర్టుకు చేరటంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాలు రంగ ప్రవేశం చేశాయి.రూల్సుకు విరుద్దంగా వ్యవహరించాలని అధికారులను టీడీపీ ప్రోత్సహిస్తే , చైర్మన్ టీడీపీ ఆదేశానుసారం నడిస్తే వారికే నష్టం అంటూ హెచ్చరించారు. ఇక ఈ సమయంలో గవర్నర్ నిర్ణయం కీలకం కానుంది .మొత్తానికి సెలక్ట్ కమిటీ వ్యవహారం ఇప్పుడు రోజుకో కొత్త పరిణామంతో రసవత్తరంగా సాగుతుంది.

English summary
The chairman of the council is very angry that the secretary has twice directed the chairman to set up the select committee. He complained to Governor Hari Chandan. Sharif, has complained that the secretary has been sacked for not implementing the rule issued by the legislative council. But now there is a big debate in the AP about what the governor will decide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X