గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని: వెదురు, అరటి తోటలకు నిప్పు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో అరటి తోటలు, వెదురుబొంగులు, తోటల వద్ద ఏర్పాటు చేసుకున్న షెడ్లను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుఝాము వరకు యథేచ్ఛగా జరిగిన ఈ దుశ్చర్యపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

తమ పొలాలను రాజధాని కోసం ఇచ్చేదిలేదని తాము విస్పష్టంగా చెప్పటం వల్లనే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. కాగా, మంత్రి పుల్లారావు, తెలుగుదేశం నేతలు బాధిత రైతులను పరామర్శించారు. పంటలకు నిప్పుపెట్టిన ఘటనపై ఏపి సిఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పంటలకు నిప్పుపెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. విచారణకు ఆదేశించారు.

మంగళవారం తుళ్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాజధానిని వ్యతిరేకించేవారే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, రాజధాని కోసం తమ భూములు ఇవ్వనందుకే రైతుల పొలాలకు నిప్పుపెట్టారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

టిడిపి నేతల పరామర్శ

టిడిపి నేతల పరామర్శ

తుళ్ళూరులో అగ్నికి అహుతైన పంటలను చూసిన అనంతరం రైతులను పరామర్శిస్తున్న మంత్రి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ నేతలు.

లింగాయపాలెంలో..

లింగాయపాలెంలో..

రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో అరటి తోటలు, వెదురుబొంగులు, తోటల వద్ద ఏర్పాటు చేసుకున్న షెడ్లను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు.

లింగాయపాలెంలో..

లింగాయపాలెంలో..

శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుఝాము వరకు యథేచ్ఛగా జరిగిన ఈ దుశ్చర్యపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

లింగాయపాలెంలో..

లింగాయపాలెంలో..

తమ పొలాలను రాజధాని కోసం ఇచ్చేదిలేదని తాము విస్పష్టంగా చెప్పటం వల్లనే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రైతులు ఆరోపించారు.

లింగాయపాలెంలో..

లింగాయపాలెంలో..

అయితే తుళ్లూరు ప్రాంతంలోని మూడు గ్రామాల్లో కూడా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. అక్కడి రైతులు మాత్రం ఇలా ఎవరు చేశారో అర్థంకావడం లేదని అంటున్నారు.

లింగాయపాలెంలో..

లింగాయపాలెంలో..

తాడేపల్లి గ్రామానికి చెందిన కొర్రపాటి శ్రీశైలం మల్లిఖార్జునరెడ్డి పొలంలోని 1500 వెదురుబొంగులను దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టడంతో లక్షన్నర రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

లింగాయపాలెంలో..

లింగాయపాలెంలో..

వెదురుబొంగులను రైతులు చూస్తే నీటితో ఆర్పేస్తారేమోనని పక్కనే ఉన్న పంపుకాడను కూడా ధ్వంసం చేశారు.

పెనుమాకలో..

పెనుమాకలో..

మరో రైతు పల్లపోగు సాంబిరెడ్డి మాట్లాడుతూ.. తన పొలంలోని తైవాన్ పవర్ స్ప్రే, 5 కట్టల ఎరువులను దుండగులు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టినట్లు చెప్పారు.

పెనుమాకలో..

పెనుమాకలో..

పెనుమాక గ్రామానికి చెందిన కల్లం పానకాలరెడ్డి పొలంలోని 2,600 వెదురుబొంగులను తగులబెట్టడంతో రూ. 3.90లక్షల నష్టం జరిగిందని తెలిపారు.

తుళ్లూరులో..

తుళ్లూరులో..

బిందు సేద్యానికి సంబంధించిన వైర్లు, మోటారు వైర్లు, లైట్లు కూడా తగులబెట్టడంతో సుమారు 5లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపారు.

తుళ్లూరులో..

తుళ్లూరులో..

పెనుమాకకు చెందిన కౌలురైతు జొన్నకూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమ పొలంలోని 1200 వెదురుబొంగులను తగులబెట్టడంతో రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు.

తుళ్లూరులో..

తుళ్లూరులో..

కౌలురైతు కల్లం వజ్రమ్మ పొలంలోని నర్సరీ నెట్, టార్పాలిన్ పట్టాలు, బిందు సేద్యానికి సంబంధించిన వైర్లు తగులబెట్టటంతో రూ.40వేల నష్టం జరిగిందన్నారు.

ఉండవల్లిలో..

ఉండవల్లిలో..

రాజధానికి భూములు ఇవ్వమని చెప్పడం వల్లనే దుండగులు తమను భయాందోళనకు గురిచేయాలని కుట్ర పన్నారని వీరు అనుమానిస్తున్నారు.

English summary
The farmers of Thullur, proposed location of the new capital, on Monday woke up to the shocker of their life as their farms were burn to ashes. Some unidentified groups have set fire to banana plantations in several villages of Tadepalli and Thullur Mandals in Guntur in the wee hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X