విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి ? చెన్నైలో ఉంటే ఏంటి ? అంటున్న ఆర్జీవీ

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన , జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఎవరికి వారు ఎవరికి తోచిన అభిప్రాయాలు వయు వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందినా వారికి కూడా ఏపీ రాజధాని వ్యవహారంపై చాలా క్యూరియాసిటీ ఉంది. ఇక ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఆయన చాల వింత ప్రతిపాదన చేశారు.

జగన్ నిర్ణయం చాలా గొప్పది..అయితే వారికి న్యాయం చెయ్యాలి..ఎంపీ సుబ్బిరామిరెడ్డిజగన్ నిర్ణయం చాలా గొప్పది..అయితే వారికి న్యాయం చెయ్యాలి..ఎంపీ సుబ్బిరామిరెడ్డి

సహజంగా జగన్ తీసుకున్న నిర్ణయాలను శభాష్ అనే రాం గోపాల్ వర్మ రాజధాని వ్యవహారంలో చాలా భిన్నంగా స్పందించారు . ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజధానిపై చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారాయి . 'బ్యూటిఫుల్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వర్మతో పాటు చిత్ర యూనిట్ వైజాగ్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా వర్మ ఏపీ రాజధానిపై తనదైన శైలిలో స్పందించారు.

What if the capital is in Anakapalli or in Chennai? RGV on capital issue

తన దృష్టిలో రాజధాని అన్న పదానికి అర్ధమే లేదని రాం గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఏ అర్ధం లేనప్పుడు అనకాపల్లిలో ఉంటే ఏంటి?, చెన్నైలో ఉంటే ఏంటి?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వర్మ . రాజధాని అంటే మెయిన్ థియేటర్‌ లాంటిదన్నారు. అది ఎక్కడ ఉన్నా ఒకటే అన్నారు. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే ప్రతి టౌన్‌కి ఒక క్యాపిటల్‌ ఉండాలని రాంగోపాల్‌ వర్మ చాలా వింతగా స్పందించారు . వర్మ చేసిన వ్యాఖ్యలు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం .
English summary
In his view, Ram Gopal Varma has said that the word 'capital' does not make sense. What if there is no meaning in Anakapalli, what if in Chennai? The capital is like the main theater. It is the same wherever it is. Ram gopal Varma has responded strangely that every town should have a capital if it wants direct governance. It is noteworthy that Varma's comments were against the Jagan decision
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X