అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండలి చైర్మన్ షరీఫ్ రైట్, స్పీకర్ కాదు.. వికేంద్రీకరణ బిల్లును చదివే సమయం ఇవ్వలేదు: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

వికేంద్రీకరణ బిల్లును చదువుకునేందుకు కూడా సమయం ఇవ్వలేరని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంతటి కీలకమైన బిల్లు చదివేందుకు కూడా టైం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని జనం ముక్తకంఠంతో నినాదిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల గోడు తప్పటని విమర్శించారు. ప్రజాభిప్రాయంతో పనిలేకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని విమర్శించారు.

చదివే సమయం ఇవ్వరా..?

చదివే సమయం ఇవ్వరా..?

ఏదైనా బిల్లు సభకు వచ్చిన సమయంలో చదువుకునేందుకు సమయం ఉంటుంది. సభలో చర్చించి ఆమోదింపజేసుకోవడం ఆనవాయితీగా వస్తోన్న ప్రక్రియ. కానీ ఆ నిబంధలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బిల్లుపై జరిగే లాభనష్టాలను చెప్పడం ప్రతిపక్ష పార్టీగా తమపై బాధ్యత ఉందని చెప్పారు. కానీ తమ హక్కులను అధికార పార్టీ కాలరాసిందని చెప్పారు.

70 మంది ఎమ్మెల్యేలు

70 మంది ఎమ్మెల్యేలు

బిల్లు చర్చించే సమయంలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 70 మంది ఎమ్మెల్యేలు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. సభ్యులే కాదు.. స్పీకర్ వైఖరి కూడా మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్ష సభ్యులతో తమ్మినేని సీతారాం నడుచుకొన్న విధానం సరికాదన్నారు.

స్పీకర్ ఇలా.. చైర్మన్ అలా..

స్పీకర్ ఇలా.. చైర్మన్ అలా..

సభలో సభ్యులు మితిమీరి ప్రవర్తించినట్టు స్పీకర్‌కు అనిపిస్తే మార్షల్స్‌ను పిలుస్తారు. సస్పెండ్ అయినా వెంటనే సభ్యులను బయటకి పంపడం సరికాదు. సభలో నిరసన తెలిపే హక్కు సభ్యులకు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కానీ మండలి చైర్మన్ హుందాగా ప్రవర్తించారని గుర్తుచేశారు. తనకున్న విచక్షణాధికారంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారని పేర్కొన్నారు. దీనిని తామే కాదు అన్నీ పార్టీలు, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని తెలిపారు.

English summary
tdp chief chandrababu naidu angry on cm jagan mohan reddy. in house govt not given time to read the Decentralization bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X