వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ దారెటు?: లెఫ్ట్‌తో జట్టు కట్టేనా, జనసేన ప్లాన్ ఇదే!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకొంటారనేది ఆసక్తిగా మారంది. 2014 ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి కూటమి తరపున రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకొంటారనేది ఆసక్తిగా మారంది. 2014 ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి కూటమి తరపున రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ఓ దఫా పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపాయి. పవన్ కళ్యాణ్ ప్రణాళికతో వస్తే పొత్తుకు ఇబ్బందులు లేవని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

2019 ఎన్నికల కోసం జనసేన చీఫ్ పవన్‌కళ్యాన్ సమాయత్తమౌతున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి పవన్‌కళ్యాణ్ పోటీ చేయనున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో కూడ జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను పవన్‌కళ్యాణ్ చేస్తున్నారు.జనసేన వలంటీర్ల శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు గాను డిజిటల్ మీడియా సిబ్బంది పనిచేస్తున్నారు.

 లెఫ్ట్ పార్టీలతో జట్టు కట్టేనా?

లెఫ్ట్ పార్టీలతో జట్టు కట్టేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో జట్టు కట్టేనా, లేదా ఇతర పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన లెఫ్ట్ పార్టీల కార్యదర్శులు ఓ దపా పవన్‌కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్రానికి చెందిని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు పవన్‌కళ్యాణ్‌తో చర్చించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో లెఫ్ట్ పార్టీలతో పవన్ కళ్యాణ్ జత కట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విధివిధానాలు ఏమిటో చెబితే తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకొనే విషయాన్ని ఆలోచిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తాజాగా చేసిన ప్రకటన చర్చకు దారితీస్తోంది.

 లెఫ్ట్ పార్టీలతో పాటు ఫ్రంట్ ఏర్పాటయ్యేనా

లెఫ్ట్ పార్టీలతో పాటు ఫ్రంట్ ఏర్పాటయ్యేనా

2019 ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల్లో విభిన్నమైన రాజకీయ వాతావరణం కన్పించే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపియేతర ప్రంట్‌ ఏర్పాటు కోసం సన్నాహలు సాగుతున్నాయి. అయితే ఈ ఫ్రంట్‌లో టిడిపి ఉంటుందా ఉండదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు ఈ ఫ్రంట్‌తో కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశం ఉందా అనే విషయమై కూడ చర్చ లేకపోలేదు. అయితే ఎన్నికల సమయం నాటికి ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్రంలో టిడిపి, వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం లేకపోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ తన ఉనికిని నిరూపించుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది. అయితే లెఫ్ట్ పార్టీలు పవన్‌తో కలిసి పోటీ చేయాలని ఏపీలో భావిస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీతో సిపిఎం సన్నిహితంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ఈ తరుణంలో జనసేన చీఫ్‌తో రెండు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేం. అయితే రానున్న రోజుల్లో ఈ విషయమై స్పష్టత రానుంది.

 ప్రత్యేక హోదా విషయంలో టిడిపి, బిజెపిపై పవన్ పోరాటం

ప్రత్యేక హోదా విషయంలో టిడిపి, బిజెపిపై పవన్ పోరాటం

ప్రత్యేక హోదా ఇస్తామని హమీ ఇచ్చిన బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హమీని విస్మరించిందని బిజెపిపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. అంతేకాదు ఈ విషయమై దక్షిణాది వారిని ఉత్తరాది వారు మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి ఎంపీలు రాజీనామాలు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయమై బిజెపిపై పవన్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బిజెపితో జత కట్టకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ప్రత్యేక హోదా విషయమై విమర్శలు గుప్పించి 2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకొంటారనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడ లేకపోలేదంటున్నారు. అయితే ఈ విషయమై లెఫ్ట్ పార్టీలతో పవన్ పొత్తు పెట్టుకొనేందుకు అవకాశాలెక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 పవన్ పోటీ ఎవరికీ లాభం

పవన్ పోటీ ఎవరికీ లాభం

2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ పార్టీ చీల్చే ఓట్లు రాజకీయంగా టిడిపికి ప్రయోజనం కల్గించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. విపక్షాలకు చెందిన ఓట్లు చీలితే పరోక్షంగా అధికారపక్షానికి ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పవన్ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావాన్ని చూపుతోందోననే విషయమై కూడ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అభిమానులు ఉంటే సరిపోదు. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్ళి ఓటు చేయించుకొనే యంత్రాంగం కూడ ముఖ్యం. అయితే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిలో పవన్ పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది.

టిడిపి, బిజెపికి వ్యతిరేక కూటమితోనే

టిడిపి, బిజెపికి వ్యతిరేక కూటమితోనే

2019 ఎన్నికల్లో టిడిపి, బిజెపి వ్యతిరేక కూటమితోనే పవన్ కళ్యాణ్ జత కట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రముఖంగా లెఫ్ట్ పార్టీల వైపుకు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని టిడిపి, బిజెపి నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి పవన్ కళ్యాణ్ మద్దతివ్వకపోవడానికి కూడ ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటం నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో టిడిపికి మద్దతిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేక.పోలేదని భావించిన నేపథ్యంలో పవన్ ఆ ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంభించారంటున్నారు. ఇదే వ్యూహన్ని 2019 ఎన్నికల సమయంలో అనుసరించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

English summary
If Jana sena chief pawan Kalyan announced its plan, we will think about alliance in 2019 elections said cpm politburo member BV Raghavulu. he spoke to media on Sunday at Vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X