వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏమిటి.. జ్యోతిష్యులు ఏమంటున్నారు..?

|
Google Oneindia TeluguNews

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.37గం.లకు ఏర్పడే చంద్రగ్రహణం తెల్లవారుజామున 2.42 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం నాలుగు నుంచి ఐదు గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈ ఏడాది సంభవించనున్న మొత్తం ఆరు గ్రహణాల్లో ఇది మొదటిది.

అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి

అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు.. సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. దీంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్నిచంద్ర గ్రహణం అంటారు. ఈ సమయంలో, చంద్రుని ఉపరితలం 90 శాతం పాక్షికంగా భూమి ద్వారా కప్పబడి ఉంటుంది.

 జ్యోతిష్యులు ఏమంటున్నారు

జ్యోతిష్యులు ఏమంటున్నారు

సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణం లేదా పాక్షిక గ్రహణం రోజు మాత్రమే కొన్ని రకాల ఆచారాలు పాటించాల్సి ఉంటుందని,సంపూర్ణ చంద్రగ్రహణానికి అవేవీ వర్తించవని పురాణ ఇతిహాసాల్లో కొంతమంది రుషులు చెప్పినట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఆలయాలు తెరుచుకునే ఉంటాయంటున్నారు.

హిందూ ఆచారాలను పాటించేవారు..

హిందూ ఆచారాలను పాటించేవారు..

హిందూ ఆచారాలను పాటించే కొంతమంది సంపూర్ణ చంద్రగ్రహణం రోజు పవిత్ర నదీ స్నానం ఆచరిస్తారు. గ్రహణం తర్వాత ఇంటి సంప్రోక్షణ,ఆపై దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవడం చేస్తారు. కొంతమంది తమ తమ విశ్వాసాల ప్రకారం జ్యోతిష్యుల సలహా మేరకు శాంతి పూజలు చేస్తుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. గ్రహణాలు కొన్ని రాశులపై అనుకూల ప్రభావం, కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ప్రతికూల ప్రభావం చూపించేవారికి ప్రత్యేక శాంతి పూజ ద్వారా దోష నివారణ చేస్తారు.

English summary
No need to follow any niyamas for this grahanam say astrologers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X