• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అప్పట్లో వైఎస్‌- ఇప్పుడు జగన్‌- ఎస్‌ఈసీతో వివాదంలో ఇద్దరి మధ్య తేడా ఇదే..

|

ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ తలపడుతున్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు ఉద్యోగులను ముందుపెట్టి భీకర పోరు సాగిస్తున్నారు. అయితే గతంలో ఎన్నికల సంఘంతో వివాదం తలెత్తినప్పుడు జగన్‌ తండ్రి, మాజీ సీఎం వైఎస్సార్‌ ఏం చేయారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. అప్పుడేం జరిగిందో చూడండి..

  AP SEC Nimmagadda Met Governor Harichandan Seek Support To Panchayat Elections | Oneindia Telugu
  ఎస్‌ఈసీతో జగన్‌ పోరాటం

  ఎస్‌ఈసీతో జగన్‌ పోరాటం

  ఏపీలో రాజ్యాంగ సంస్ధ అయిన ఎన్నికల కమిషన్‌ గతేడాది స్ధానిక ఎన్నికలను వాయిదా వేసిందన్న కారణంగా ప్రభుత్వం కత్తి కట్టినట్లే వ్యవహరిస్తోంది. నిమ్మగడ్డ పదవిలో ఉండగా స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎట్టి పరిస్ధితుల్లోనూ నిర్వహించకుండా సకల ప్రయత్నాలూ చేస్తోంది. ఓవైపు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ఉద్యోగ సంఘాలతో సహాయ నిరాకరణ చేయిస్తూ, ఇంకోవైపు రాజకీయ విమర్శలకూ దిగుతూ క్షణం తీరికలేకుండా పోరాటం చేస్తోంది. పొరబాటున ఎన్నికలు జరిగితే నిమ్మగడ్డ చేతిలో ఓడిపోయినట్లే అని భావిస్తున్న వైఎస్‌ జగన్‌ అందుకు తగ్గట్టుగా కౌంటర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

  వైఎస్‌ హయాంలోనూ ఎస్‌ఈసీతో వివాదం

  వైఎస్‌ హయాంలోనూ ఎస్‌ఈసీతో వివాదం

  జగన్‌ హయాంలోనే కాదు ఆయన తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఎస్‌ఈసీతో వివాదాలు తప్పలేదు. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్సార్‌కు... 2006లో విశాఖ అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణ సందర్భంగా ఓ సమస్య వచ్చిపడింది. రిటర్నింగ్‌ అధికారి హోదాలో కలెక్టర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉన్నారు. అప్పటికే ఈసీ ఆమోదం పొందిన పోలింగ్‌ బూత్‌ అధికారుల జాబితాపై అధికారుల సమీక్షలో ఆయనకు కొన్ని ఫిర్యాదులు అందాయి.. అంతే అప్పటికప్పుడు ప్రవీణ్‌ ప్రకాష్‌ సదరు అధికారిని తప్పించేశారు. దీంతో ఎస్‌ఈసీ కార్యాలయంలో ఉన్న డిప్యూటీ కమిషనర్‌ బాలకృష్ణ పిళ్లై నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లు అధికారులను తప్పించడం కుదరదని, ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించారు. దానికి ఒప్పుకోకపోవడంతో ప్రవీణ్‌ ప్రకాశ్‌నే తప్పించాలని ప్రభుత్వానికి ఎస్‌ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

  జగమొండి వైఎస్‌ వెనక్కి తగ్గిన వేళ

  జగమొండి వైఎస్‌ వెనక్కి తగ్గిన వేళ

  తాను ఓసారి ఓ విషయాన్ని నమ్మితే చాలు ఆ తర్వాత ఎవరేం చెప్పినా నమ్మరని పేరున్న సీఎం వైఎస్సార్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ను తప్పించేందుకు ససేమిరా అన్నారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం.. ఎన్నికల సమయంలో ఈసీయే సుప్రీం అని, ఆయన మాటను గౌరవించకపోతే మనకే నష్టం అని, తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని వైఎస్‌కు చెప్పారు. ఈ వాదనతో ఏకీభవించిన వైఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీకి అంగీకరించారు. అప్పుడు ప్రవీణ్‌ ప్రకాష్‌ను విశాఖ నుంచి తూర్పుగోదావరి కలెక్టర్‌గా పంపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

  2008లో మరోసారి ఇదే రిపీట్‌

  2008లో మరోసారి ఇదే రిపీట్‌

  కాకతాళీయంగా ఇలాంటి ఘటనే వైఎస్‌ హయాంలో మరోసారి చోటు చేసుకుంది. అప్పట్లో వికారాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ పని తీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన్ను బదిలీ చేయాలని 2008 ఏప్రిల్‌ 26న ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరో మాట మాట్లాడకుండా ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసేశారు. తద్వారా ఎన్నికల సంఘంతో మరో ఘర్షణను నివారించారు. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు అదే ప్రవీణ్‌ ప్రకాష్‌ సీఎం జగన్‌ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

  జగన్‌, వైఎస్సార్‌ మధ్య తేడా అదే...

  జగన్‌, వైఎస్సార్‌ మధ్య తేడా అదే...

  వైఎస్‌ జగన్‌ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన తండ్రి వైఎస్సార్‌ టైపు కాదు తాత రాజారెడ్డి టైపు అని టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా జగన్‌ పాలనను రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఎగతాళి చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఎస్‌ఈసీతో వివాదం పరిష్కారం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని జగన్‌ తీరును చూస్తుంటే అది నిజమే అని ఒప్పుకోక తప్పదు. లౌక్యంతో పరిష్కారమయ్యే అంశాన్ని కూడా తెగేదాకా లాగడం ద్వారా జగన్‌ విమర్శలకు తావిస్తున్నారని మేథావులు చెప్తుంటే.. తన ఇగో కోసం ఉద్యోగులను బలి చేస్తున్నారని మరోవైపు విమర్శలు వినిపిస్తున్నాయి.

  English summary
  ys jagan led andhra pradesh government's dealing with state election commission draws criticism among opposition and common people also. but earlier his father ys raja sekhar reddy's had dealt with the sec is now trending in news.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X