వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి: ఇంతియాజ్‌కు షాక్, బాబుకు కలిసొచ్చేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు. అయితే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరితే ఇప్పటి వరకు పీలేరు అసెంబ్లీ ఇంఛార్జీగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ భవితవ్యమేమిటనే చర్చ సాగుతోంది.పార్టీ కోసం ఇంతకాలం పాటు పనిచేసిన ఇంతియాజ్ అహ్మద్‌కు చంద్రబాబునాయుడు ఏ రకమైన భరోసా ఇస్తారోననే చర్చ సాగుతోంది.

Recommended Video

Nallari Brother Joins TDP | Oneindia Telugu

ఆ వర్గాలు కలిసేనా, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి లాభమేనా?ఆ వర్గాలు కలిసేనా, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి లాభమేనా?

ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. వారం రోజుల క్రితం కిషోర్‌కుమార్ రెడ్డి అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. తన అనుచరులతో కలిసి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు.

కిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకికిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకి

టిడిపిలో చేరేందుకునల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చాలా కాలంగా రంగం సిద్దం చేసుకొన్నారు. తన అనుచరులతో నల్లారి కిషోర్‌రెడ్డి రెండు మాసాల క్రితమే చర్చించారు. అనుచరులు కూడ టిడిపిలో చేరేందుకు సానుకూలంగా స్పందించడంతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు.

 పీలేరు టిడిపి ఇంఛార్జీ ఇక్బాల్ అహ్మద్ భవితవ్యం ఏమిటీ?

పీలేరు టిడిపి ఇంఛార్జీ ఇక్బాల్ అహ్మద్ భవితవ్యం ఏమిటీ?

చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జీ ఇంతియాజ్ అహ్మద్ భవితవ్యమేమిటనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరితే నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతలను కిషోర్‌కుమార్‌రెడ్డికి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న ఇంతియాజ్ అహ్మద్‌కు ఏ బాధ్యతలను అప్పగిస్తారనే చర్చ సాగుతోంది.

 ముస్లిం ఓటర్లు ఎక్కువగా స్థానం పీలేరు

ముస్లిం ఓటర్లు ఎక్కువగా స్థానం పీలేరు

జిల్లాలో అత్యధిక శాతం ముస్లింలున్న నియోజక వర్గంగా పీలేరుకు గుర్తింపు ఉంది. ఈ కారణంగానే చంద్రబాబు సామాజిక న్యాయంలో భాగంగా 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కాకముందు కూడ వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ 2004లో ముస్లిం అభ్యర్థికి అవకాశం కల్పించింది టిడిపి. అయితే టిడిపిలో నెలకొన్న గ్రూపు తగాదాల కారణంగా టిడిపి అభ్యర్థులు ఈ స్థానంలో ఓటమి పాలయ్యారు.

 2014లో చివరి నిమిషంలో టిక్కెట్టు

2014లో చివరి నిమిషంలో టిక్కెట్టు

2004, 2009 ఎన్నికల్లో బరిలో ఉండిన మాజీ సబ్‌ జడ్జి ఇంతియాజ్‌ అహ్మద్‌ , పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డిలు ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.దీంతో టిడిపికి నాయకత్వం లేకుండా పోయింది. దీంతో 2014 ఎన్నికల సమయంలో టిక్కెట్టు కేటాయింపు విషయంలో చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది.

 ఇంటింటికి టిడిపిలో 4వ, స్థానం

ఇంటింటికి టిడిపిలో 4వ, స్థానం

టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్బాల్‌ సైతం నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గం జిల్లాలో నాల్గో స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి చేరిక మైనారిటీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. పీలేరు పార్టీ బాధ్యతలు కిశోర్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఇక్బాల్‌ భవితవ్యం ఎలా వుండబోతుందనే విషయమై మైనారిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
What is the future of pileru tdp incharge Iqbal Ahmed, Nallari Kishore Kumar reddy will join in Tdp on Nov 23 or 25.Tdp local leader demanding too Chandrababu naidu to assurance to Iqbal Ahmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X