వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏలోనే ఉంటారా, వైదొలుగుతారా, బాబు నెక్ట్స్ ప్లాన్ ఏమిటి?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నెక్ట్స్ స్టెప్ ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపి వైదొలిగింది.

తొందరపడొద్దు, మాట్లాడుకుందాం రా: మోడీ, బావోద్వేగం మేరకు నిర్ణయం: బాబుతొందరపడొద్దు, మాట్లాడుకుందాం రా: మోడీ, బావోద్వేగం మేరకు నిర్ణయం: బాబు

కానీ ఎన్డీఏలో కొనసాగుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రానికి కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రాకపోతే ఎన్డీఏ నుండి వైదొలుగుతుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిని కల్గిస్తోంది.

బాబు ఎఫెక్ట్: కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఎవరికీ, అదృష్టవంతులు వీరేనా?బాబు ఎఫెక్ట్: కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఎవరికీ, అదృష్టవంతులు వీరేనా?

ఏపీ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రాలేదు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్

కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగే విషయంలో ప్రధానమంత్రి మోడీ వారించినా కానీ, బాబు మాత్రం వెనక్కు తగ్గలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబునాయుడు మోడీకి వివరించారు.

రంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామారంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామా

బిజెపిపై ఒత్తిడి పెంచిన బాబు

బిజెపిపై ఒత్తిడి పెంచిన బాబు

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులను రాబట్టే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపి వైదొలిగింది. అయితే ఎన్డీఏలో మాత్రం కొనసాగాలని నిర్ణయం తీసుకొంది.ఎన్డీఏలోనే టిడిపి ఉండడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఎన్డీఏలో ఇంకా టిడిపి కొనసాగడం వ్యూహత్మక నిర్ణయమమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాష్ట్రానికి సహయం చేసే విషయమై కేంద్రం నుండి నిధుల విడుదలలో బిజెపి వ్యవహరించే తీరు ఆధారంగా ఎన్డీఏలో కొనసాగాలో వద్దో అనే విషయమై టిడిపి నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్లమెంట్‌లో నిరసనల హోరు

పార్లమెంట్‌లో నిరసనల హోరు

పార్లమెంట్ సమావేశాల్లో నిరసనలను పెద్ద ఎత్తున కొనసాగించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగింది. దీంతో శుక్రవారం నుండి పార్లమెంట్‌లో నిరసనల హోరును ఇంకా పెంచే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, స్పెషల్ స్టేటస్ అంశంపై పార్టీలు అనుసరించిన వైఖరిపై అన్ని పార్టీల మద్దతును కూడగట్టనుంది.ఈ మేరకు అన్ని పార్టీలకు టిడిపి లేఖలను రాయనుంది.తమ సమస్యకు మద్దతివ్వాలని టిడిపి కోరుతోంది.

ఎన్డీఏ నుండి వైదొలిగే అవకాశం ఉందా

ఎన్డీఏ నుండి వైదొలిగే అవకాశం ఉందా

ఏపీ రాష్ట్రానికి నిదులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల వస్తేనే పోలవరం వంటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది.కానీ, కేంద్రం నుండి ఇప్పటికే టిడిపి వైదొలిగింది. ఎన్డీఏలో కొనసాగడానికి పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులను రాబట్టుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయినా కేంద్రం నుండి సానుకూలంగా పరిణామాలు రాకపోతే ఆ సమయంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా టిడిపి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపుపై పోరాటం చేస్తారా

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపుపై పోరాటం చేస్తారా

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని దక్షిణాది రాష్ట్రాలతో జట్టుకట్టి పోరాటం చేస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణ సీఎం కెసిఆర్ థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కీలకంగా చర్చలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాజకీయాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని బాబు బుధవారం నాడు ప్రకటించారు. అయితే భవిష్యత్ లో చోటుచేసుకొనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ రకమైన వ్యూహన్ని బాబు అనుసరిస్తారనేది త్వరలోనే తేలనుంది.

English summary
what is the future plan of Tdp chief chandrababu naidu, Tdp quit from union cabinet on Thursday evening.Chandrababu naidu discussing with party leaders about future plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X