• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇలా ఐతే ఎలా సీఎం సర్.?సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నట్టు.?వైరల్ అవుతున్న లోకేష్ ట్వీట్.!

|

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాలు చేసే వారికి ప్రతిదీ రాజకీయంగానే కనిపిస్తుంది. ఎదిటి వారిలో ఏ చిన్న మార్పు కనిపించినా దాన్ని రాజకీయ కోణంలో చూడడం, సోషల్ మీడియాలో అభిప్రాయాలను షేర్ చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఒక రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర మంత్రులతో శాసన సభకు వెళ్తున్న సందర్బంగా చేసిన ఓ చిన్న పొరపాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అస్త్రంలా మారింది.

జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు ఆ అంశం కూడ ప్రతిపక్షపార్టీకి దోహదం చేసిందంటే రాజకీయ కోణం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏమరుపాటుగా చేసిన ఆ పని ఏంటి.?దాని ద్వారా జగన్ ను టార్గెట్ చేస్తూ టీడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన ట్వీట్ ఏంటి.?తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించ ఓ వ్యంగ్యాస్త్రాన్ని సోషల్ మీడియాలో ఎక్కుపెట్టారు నారా లోకేష్. ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారని ట్వీట్ చేసారు లోకేష్. ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారన్నారు లోకేష్. తొలి విడ‌త‌లో కోవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేసుకున్నా, బ్లీచింగ్ చ‌ల్లినా కరోనా చ‌చ్చిపోతుందని సీఎం జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసారు.

 What is the message to the society cm sir.?Lokesh tweet goes viral.!

ఇట్ క‌మ్స్ ఇట్ గోస్..ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారన్నారు లోకేష్. సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మ‌శానంగా మారుతుంటే చిరు న‌వ్వులు చిందిస్తూ,మీరే మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెన్ని వేల‌మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారని లోకేష్ ప్రశ్నాంచారు. మాస్క్ వేసుకుని నలుగురికి ఆదర్శంగా ఉండాలని లోకేష్ హితవు పలికారు.

English summary
TDP Mlc Lokesh tweeted that you are giving crores of rupees worth of ads with your photo and name, saying that it is wrong to wear a mask, what are you signaling to the people without wearing a mask.Lokesh questioned ap cm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X